Advertisement
Google Ads BL

టీడీపీకి రాజీనామా.. ఎటువైపు అడుగులు..


ఏపీలో మరికొద్ది రోజుల్లో ఎన్నికల నగర మోగబోతుంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ పార్టీలో చాలా చమక్కులు జరుగుతున్నాయి.. ఇన్నాళ్లూ టీడీపీ లో ఉన్న అంతర్గత గొడవలు ఇప్పుడు బహిరంగంగా కనిపిస్తున్నాయి. చంద్రబాబు టీడీపీ నేతలని ఇప్పటివరకు ఎలాగోలా మ్యానేజ్ చేసుకొస్తూ వచ్చినా ఇప్పుడు మాత్రం అలా మేనేజ్ చెయ్యలేక చేతులెత్తేస్తున్నారు. తాజాగా విజయవాడ నుచి టీడీపీ తరుపున రెండుసార్లు గెలిచినప్పటికీ కేశినేని నానిని పార్టీనుంచి బయటకు పంపేసినంత పని చేశారు. పార్టీలో ఉండండి కానీ పార్టీ వ్యవహారాల్లో జోక్యం వద్దు.. పెద్దరికం చూపొద్దు.. ఉండీ లేనట్లు అలా ఉండండి అంటూ రాయబారం పంపారు. 

Advertisement
CJ Advs

ఈనెల 7న తిరువూరులో జరగబోయే చంద్రబాబు సభకు నానిబదులు ఆయన తమ్ముడి చిన్నిని ఇంచార్జి గా నియమించారు. అంతేకాకుండా తిరువూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని నానిని పార్టీ ఆదేశించింది. 7న తిరువూరులో చంద్రబాబు సభ ఏర్పాటు చేయగా ఈ విషయమై చర్చించేనిమిత్తం చిన్ని, నాని వర్గీయులు తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో బుధవారం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరువర్గాలవారూ కొట్టుకున్నారు.  జిల్లా పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం, ఎమ్మెల్యే గద్దె రాంమోహన్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణలతో కలిసి కేశినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి దేవదత్‌ ఏర్పాటు చేసిన ప్లెక్సీలలో ఎంపీ నాని ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఇది కాస్తా చినికిచినికి గాలివానలా మారింది. తమను అవమానించేందుకే సిట్టింగ్ ఎంపీ నాని ఫొటో ప్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ నాని వర్గం ఆందోళన చేసింది.

పార్టీ వ్యవహారాల్లో జోక్యం వద్దంటూ అధిష్టానం ఆదేశం

ఆ తరువాత అక్కడికి వచ్చిన చిన్నిని సైతం నాని వర్గీయులు అడ్డుకున్నారు. తరువాత ఇరు వర్గాల కార్యకర్తలు కుర్చీలు విసురుకుంటూ దాడులకు పాల్పడుతూ గందరగోళం సృష్టించారు. ఆ తరువాత కేశినేని నానికి టీడీపీ హైకమాండ్‌ చెక్‌ పెట్టింది. తిరువూరులో జరగబోయే చంద్రబాబు సభకు మరో ఇంఛార్జ్‌ను హైకమాండ్‌ నియమించింది. అలాగే, కేశినేని తిరువూరు రాజకీయాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబును ఆదేశించింది. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా మరొకరికి ఛాన్స్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని నానికి టీడీపీ పార్టీ హైకమాండ్‌ ఆదేశాలు జారీ చేసింది. 

టీడీపీకి రాజీనామా ?  ఎటువైపు అడుగులు  ?

దీనిపట్ల నాని కూడా తనదైన స్టయిల్లో స్పందించారు.. తాను ఎవరికీ గులాంగిరీ చేసేది లేదని పేర్కొంటూనే ఇండిపెండెంటుగా గెలవగలను అని ప్రతిజ్ఞ చేశారు. బోండా ఉమా వంటివాళ్ళు నానిని విజయవాడలో విమర్శిస్తూ... వ్యతిరేకిస్తూ వస్తున్నారు. తాజాగా చంద్రబాబు పంపగా వచ్చిన ఒక ప్రతినిధిబృందం నానిని కలిసి పార్టీ పనుల్లో జోక్యం వద్దని సూచించి వెళ్ళింది. ఇదే విషయాన్నీ ఆయన ఫెసుబుక్కులో సైతం స్పష్టం చేసారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు రావని, అవి వస్తే ఇంకా గొప్ప పొజిషన్లో ఉండేవాణ్ణని అంటూ చురకలంటించారు.  ఇక నేడో రేపో ఎంపీగా రాజీనామా చేస్తానని ప్రకటించారు.. తరువాత తన రాజకీయ గమనం ఎటు ఉంటుందో తెలుస్తుంది అన్నారు.

MP Kesineni:

TDP
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs