Advertisement
Google Ads BL

సంక్రాంతి సినిమాల రేటింగ్స్ SM లో వైరల్


మరో వారం రోజుల్లో సంక్రాంతి పండగ సినిమాల హడావిడి మొదలైపోతుంది. ఇప్పటికే సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. ముందుగా జనవరి 12 శుక్రవారం గుంటూరు కారంతో మహేష్ సంక్రాంతి సంబరాలు స్టార్ట్ చెయ్యబోతున్నాడు. అదే రోజు కుర్ర హీరో తేజ సజ్జ హనుమాన్ అంటూ డివోషనల్ టచ్ ఇవ్వబోతున్నాడు. ఇక జనవరి 13 వెంకటేష్ సైంధవ్‌ తో థ్రిల్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఇక రవితేజ ఈగల్ తప్పుకోవడంతో ఓ సినిమా క్లాష్ తప్పింది.

Advertisement
CJ Advs

జనవరి 14 న నాగార్జున నా సామిరంగా తో సంక్రాంతి మూవీస్ కి ముగింపు పలుకుతున్నాడు. అయితే ఇప్పుడు గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్‌, నా సామిరంగా సినిమాలు ప్రమోషన్స్ లో సినిమాలపై హైప్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ప్రేక్షకులు రోజుకో మూవీ చూసేందుకు రెడీ అవుతున్నారు. కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఈ చిత్రాలతోపాటుగా సంక్రాంతికే విడుదల కాబోతున్న తమిళ చిత్రాలపై ఓ అంచనాకు వచ్చేస్తూ.. ఆ చిత్రాలలో ఎంత బలముందో.. వాటి క్రిటిక్స్ ఎంత రేటింగ్స్ వేస్తారో అనేది ముందే ఊహించేసి మరీ రేటింగ్స్ ని వైరల్ చేస్తున్నారు.

అందులో తమిళ చిత్రాలు కూడా ఉన్నాయి.

విజయ్ సేతుపతి మేరీ క్రిస్టమస్ కి 3.5 / 5 రేటింగ్

మహేష్-త్రివిక్రమ్ గుంటూరు కారం 2.5/5

ధనుష్ కెప్టెన్ మిల్లర్ - 3.5/5

ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ  హనుమాన్ - 3.75/5

శివ కార్తికేయన్ అయలన్ - 2.5/5

వెంకటేష్-శైలేష్ కొలను సైంధవ్- 2.75/5

నాగార్జున నా సామి రంగ- 3.25/5

మరి ఈ రేటింగ్ చూస్తే మహేష్ ఫాన్స్ ఊరుకుంటారా... ఈ రేటింగ్స్ వైరల్ చేసే వాళ్ళ పని పట్టరూ. అసలు సినిమాలు విడుదల కాకూండా ఇలాంటివి స్ప్రెడ్ చేయడమే ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్లకే తెలియాలి. 

Sankranti movie ratings are viral on SM:

The rush of Sankranti festival movies will begin In week
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs