Advertisement
Google Ads BL

గురూజీ.. మీనాక్షిని ఏం చేస్తారో?


త్రివిక్రమ్ కొంతకాలంగా తన సినిమాల్లో ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టి అందులో ఓ హీరోయిన్ కి ఆధిక ప్రాధాన్యత ఇస్తూ రెండో హీరోయిన్ ని తక్కువ చేస్తున్నారు. ఈ విషయం ఆయన సినిమా విడుదలవుతున్నప్పుడల్లా హైలెట్ అవుతూనే ఉంది. గతంలో అజ్ఞాతవాసిలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ కి సరిసమానమైన పాత్రలు ఇచ్చారు. సన్ అఫ్ సత్యమూర్తిలోను సెకండ్ హీరోయిన్ గా చేసిన ఆదా శర్మ కి మంచి కేరెక్టర్ ఇచ్చారు. ఆ తర్వాత అరవింద సమేత, అలా వైకుంఠపురములో సినిమాలో సెకండ్ హీరోయిన్స్ గా చేసిన ఈషా రెబ్బ, నివేదా పెతురాజ్ లని కూరలో కరివేపాకులా తీసిపారేసారు.

Advertisement
CJ Advs

అందుకే ఇప్పుడు మీనాక్షి చౌదరి అభిమానులు భయపడుతున్నారు. మా మీనాక్షికి మంచి సినిమాలో, భారీ బడ్జెట్ సినిమాలో, స్టార్ హీరో సరసన ఛాన్స్ అయితే ఇచ్చారు.. అలాగని ఆమె ఐడెంటిటీని తక్కువ చెయ్యరు కదా అంటూ అడుగుతున్నారు. మహేష్ బాబు లాంటి హీరో సరసన, గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్ గా త్రివిక్రమ్ ఛాన్స్ ఇచ్చారు అనగానే మీనాక్షి లక్కు ని పొగడని వారే లేరు. కానీ ఇప్పుడు గుంటూరు కారం విడుదలకు దగ్గరయ్యే సమయంలో మీనాక్షిలుక్ ని మహేష్ తో సహా కలిపి కాస్త లేట్ గా పరిచయం చేసారు.

ఆమె పాత్ర ఎలా ఉంటుంది, ఆమె పాత్ర నిడివి ఎంత ఉంటుంది, త్రివిక్రమ్ మళ్ళీ సెకండ్ హీరోయిన్ పాత్రని లైట్ తీసుకోలేదు కదా అనే కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం సినిమా విడుదలయ్యాక హీరోయిన్స్ విషయం తేలిపోతుంది. అప్పటివరకు ఈ సస్పెన్స్ భరించాల్సిందే. 

First look of Meenakshi Chaudhary from Guntur Kaaram:

What Is Meenakshi Role in Guntur Karam?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs