విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. నిన్న రాజుకున్న వివాదం.. నేటికీ కొనసాగుతోంది. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు విజయవాడ ఎంపీ సీటు ఇవ్వనన్నారంటూ పెద్ద సంచలనమే సృష్టించారు. చంద్రబాబు అలా చెప్పిన తర్వాత కూడా తను టీడీపీలో కొనసాగడం భావ్యం కాదని భావిస్తున్నానని కాబట్టి పార్టీతో పాటు లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్టు నేటి తెల్లవారుజామున 4:40 గంటలకు ఎక్స్ వేదికగా కేశినేని నాని తెలిపారు. ఇప్పుడు ఈ న్యూస్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అన్యాయం జరిగినట్టుగా ఫీలవుతున్న నాని..
నిజానికి కేశినేని నాని రాజీనామా చేయబోతున్నారంటూ ఇప్పుడు కాదు.. ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కేశినేని నానికి, ఆయన తమ్ముడు కేశినేని చిన్నికి పడటం లేదు. పర్సనల్ గొడవ కాస్తా పార్టీ వరకూ తీసుకొచ్చారు. కేశినేని చిన్నికి ఏమైనా ప్రాధాన్యమిస్తే తనకేదో అన్యాయం జరిగినట్టుగా కేశినేని నాని ఫీలవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీతో కొనసాగుతున్నారన్న మాటే కానీ ఏదో ఒక ప్రకటన చేస్తూనే ఉన్నారు. అది కాస్తా పార్టీకి ఇబ్బందికరంగా మారుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు తరచూ కేశినేని నానికి నచ్చ చెబుతూనే ఉన్నారు కానీ ఆయన తీరు మాత్రం మారడం లేదు.
ఆ సీటు ఎవరకనేది వైసీపీలో క్లారిటీ లేదు..
ఇక కేశినేని నాని రాజీనామా చేస్తారు సరే.. నెక్ట్స్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా? లేదంటే కూతురు శ్వేతను రంగంలోకి దింపుతారా? అదీ కాదంటే వైసీపీలోకి జంప్ చేస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది. కేశినేని నాని రాజీనామా ప్రకటన చేసిన వెంటనే వైసీపీ అయితే రాయబారాలు నడుపుతుందనడంలో సందేహం లేదు. అది కూడా గతంలో నానిపై పోటీ చేసిన పీవీపీ లేరు. పైగా ఆ సీటు ఎవరికి అనేది కూడా ఇంతవరకూ వైసీపీలో క్లారిటీ లేదు.ఈ తరుణంలో వైసీపీలోకి నాని జంప్ చేసినా ఆశ్చర్యం లేుద.అయినా పీక్ టైంలో టీడీపీ ఇలాంటి ప్రకటన చేసి తప్పు చేసిందా? అనేది కూడా హాట్ టాపిక్‌గా మారింది. ఈ తరుణంలో సిట్టింగ్‌లను మార్చి రచ్చరచ్చ చేసుకోవడమెందుకు? అప్పుడు టీడీపీకి, వైసీపీకి తేడా ఏముంది? అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. చూడాలి ఇక ఏం జరుగుతుందో..