Advertisement
Google Ads BL

GK: సారీ పర్మిషన్ దొరకలే..


రేపు శనివారం జనవరి 6 సాయంత్రం హైదరాబాద్ యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో జరగబోయే గుంటూరు కారం ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పై మహేష్ అభిమానులు చాలానే హోప్స్ పెట్టుకున్నారు. గుంటూరు కారం షూటింగ్ ముగించేసి దుబాయ్ వెళ్ళిన మహేష్ తిరిగి హైదరాబాద్ కి వచ్చాక గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరవుతారు.. అభిమాన స్టార్ హీరోని ఎదురుగా చూడొచ్చు, ఆయన ఇచ్చే స్పీచ్ వినొచ్చనే ఆశతో అభిమానులు ఉన్నారు. ఈ ఈవెంట్ కి ఎవరొచ్చినా పాస్ ల కోసం మమ్మల్ని అడగండి అంటూ ఈవెంట్ నిర్వాహకులు పబ్లిసిటీ చేసుకున్నారు.

Advertisement
CJ Advs

కానీ ఇప్పుడు గుంటూరు కారం మేకర్స్ సారీ గుంటూరు కారం ఈవెంట్ యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో జరుపుకునేందుకు పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు.. సెక్యూరిటీ రీజన్స్ అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని పోస్ట్ పోన్ చేసారు మేకర్స్. మళ్ళీ మరో డేట్ చూసుకుని, వెన్యూ గురించి ప్రకటిస్తామని ఇచ్చిన అప్ డేట్ తో మహేష్ ఫాన్స్ ఫుల్ గా డిస్పాయింట్ అవుతున్నారు. మళ్ళీ ఎప్పుడు డేట్ చెప్బుతారో.. ఎప్పుడెప్పుడు మహేష్ ని చూస్తామో అనే ఆతృతలో వాళ్ళు ఉన్నారు. జనవరి 12 అంటే వచ్చే శుక్రవారమే గుంటూరు కారం ప్రేక్షకులముందుకు రాబోతుంది. 

untur Kaaram Pre Release Event Postponed:

Guntur Kaaram pre-release event postponed due to security issues
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs