Advertisement
Google Ads BL

వావ్ జాన్వీ.. దేవర గురించి ఏం చెప్పావ్..


యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర ప్యాన్ ఇండియా ఫిలిం తో సౌత్ కి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ ఈరోజు శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని తీర్ధ ప్రసాదాలు అందుకుంది. గోల్డ్ కలర్ పట్టు శారీ లో అచ్చతెలుగు ఆడపిల్లలా అలంకరించుకుని జాన్వీ కపూర్ కనువిందు చేసింది. తిరుమల ఎప్పుడు వెళ్లినా పట్టుపరికిణీ, లంగా ఓణిలో కనిపించే జాన్వీ కపూర్ ఈరోజు మాత్రం పట్టు చీరలో మెరిసిపోయింది. తన పిన్ని మహేశ్వరీ, బాయ్ ఫ్రెండ్ తో కలిసి జాహ్నవి శ్రీవారి దర్శనానికి వెళ్ళింది.

Advertisement
CJ Advs

దర్శనానంతరం ఆమె ఫొటోలకి ఫోజులివ్వడమే కాదు.. దేవర సినిమాలో నటించే విషయమై మీడియాతో మాట్లాడి ఎన్టీఆర్ అభిమానుల మనసులని దోచేసింది. దేవర సెట్స్ లోకి అడుగుపెట్టిన తర్వాత ఓ అనుభూతికి లోనయ్యాను, ఇప్పటివరకు తాను చేసిన సినిమాలన్నీ జస్ట్ వర్క్ షాప్ లా అనిపించాయి. దేవర సినిమాలో నటిస్తుంటే.. ఇప్పుడే హీరోయిన్ అయ్యానా అనే ఫీలింగ్ వస్తుంది.. నా అసలు కెరీర్ దేవరతో మొదలుపెట్టినట్టుగా ఉంది అంటూ జాన్వీ కపూర్ దేవరపై ఉన్న అంచనాలను పదింతలు పెంచేసింది.

కొరటాల శివ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ ని తీసుకుని అందరిలో హైప్ క్రియేట్ చేసారు. అంతేకాకుండా జాన్వీ కపూర్ దేవర లుక్ ని అందరూ ఇంప్రెస్స్ అయ్యేలా చూపించడంతో.. ప్రస్తుతం ఆమె కేరెక్టర్ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ నేల 8న రాబోయే దేవర గ్లిమ్ప్స్ లో ఎన్టీఆర్ సరసన ఆమెది చిన్న షాట్ అయినా ఉండాలని ఎన్టీఆర్ ఫాన్స్ తో పాటుగా శ్రీదేవి ఫాన్స్ కూడా కోరుకుంటున్నారు. 

Janhvi Had Self Realisation On The Sets Of Devara:

Devara Is Like Homecoming Says Janhvi Kapoor
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs