Advertisement
Google Ads BL

ప్రశాంత్ అరెస్ట్ పై అమర్ ఫస్ట్ రియాక్షన్


బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ఫాన్స్.. రన్నర్ అమర్ దీప్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కారు అద్దాలను ధ్వంశం చేస్తూ భయబ్రాంతులకు గురి చెయ్యడంతో పల్లవి ప్రశాంత్ పై ఆయన ఫాన్స్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. తర్వాత పల్లవి ప్రశాంత్ ఆయన అభిమానులు బెయిల్ పై బయటికొచ్చారు. అయితే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై శివాజీ దగ్గర నుంచి బోలే వరకు, ఇంకా శుభశ్రీ, యావర్ ఇలా అందరూ ఛానల్స్ లో ఇంటర్వ్యూల్లో మట్లాడారు. కాని అమర్ దీప్ ఇప్పటివరకు పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై స్పందించనే లేదు.

Advertisement
CJ Advs

తాజాగా అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై రియాక్ట్ అయ్యాడు. ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ మట్లాడుతూ ఫలితం ఎలా ఉన్నా తాను చాలామంది మనసులని గెలిచాను, అదే సంతోషంలో ఒక మైండ్ సెట్‌తో బయటకు వచ్చాను, నేను విన్నర్ ని కాకపోయినా.. రవితేజ సినిమాలో ఆఫర్ వచ్చింది, అంతకన్నా నాకేం కావాలి. మాస్ రాజా రవితేజ ఫోన్ కోసం వెయిటింగ్. ఇంకా చాలా ఆఫర్స్ వచ్చాయి. అవన్నీ ఓ మంచి రోజు చూసి బయటపెడతాను అంటూ చెప్పిన అమర్ దీప్ పల్లవి అరెస్ట్ పై కూడా స్పందించాడు.

బిగ్ బాస్ ఫినాలే రోజున అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిందంతా పక్కన పెడితే.. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ మాత్రం కేవలం పోలీసుల మిస్ అండర్‌స్టాండ్ వల్లే జరిగింది. అది మొత్తం ఇప్పుడు క్లియర్ అయిపోయింది. ఎవరూ ఈ విషయంలో ఏం టెన్షన్ పడనవసరం లేదు. అందరూ బాగానే ఉన్నారు. మేము కూడా చాలా హ్యాపీగా కలిసే ఉన్నాము.. అంటూ అమర్ దీప్ మొదటిసారిగా పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై స్పందించాడు. 

Amardeep first reaction on Prashant arrest:

Amardeep Chowdary First Reaction On Pallavi Prashanth Arrest
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs