Advertisement
Google Ads BL

వడివడిగా హడావిడిగా నా సామిరంగా


సంక్రాంతి రిలీజ్ అంటూ నిన్నమొన్నటివరకు డేట్ లాక్ చెయ్యకుండా డిసెంబర్ 31 వరకు సస్పెన్స్ చూపించిన నాగార్జున నా సామిరంగా మేకర్స్ అప్పుడు జనవరి 14 రిలీజ్ అంటూ రిలీజ్ తేదీని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ప్రమోషనల్ పోస్టర్స్, సాంగ్స్ విడుదల చేస్తున్నారు, పక్కా సంక్రాంతి మూవీలా ప్రొజెక్ట్ అయిన నా సామిరంగాలో నాగార్జున తో పాటుగా కుర్ర హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈరోజు కూడా ఓ పాటని రివీల్ చేసారు మేకర్స్.

Advertisement
CJ Advs

అయితే గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్‌ ఇవన్నీ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా పబ్లిసిటీ వ్యవహారాల్లో బిజీగా ఉంటే.. నాగార్జున నా సామిరంగా షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లపై ఇంకా ఓ పాట చిత్రీకరణ జరుగుతుంది. అది పూర్తయితేనే నా సామిరంగా షూటింగ్ కంప్లీట్ అయినట్లు. మరి సినిమా విడుదలకు జనవరి 14 అంటే ఇంకా పది రోజుల సమయం మాత్రమే ఉంది. నా సామిరంగా మేకర్స్ హారి బరిగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్నారు.

మిగతా సంక్రాంతి మూవీస్ అన్నీ షూటింగ్ ఫినిష్ చేసుకుని ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి టైమ్ సెట్ చేసుకుని కూల్ గా కూర్చుంటే నా సామిరంగా మాత్రం ఇంకా హడావిడిగా సెట్స్ లోనే కనిపించడం అక్కినేని అభిమానులకి ఆందోళన కలిగిస్తుంది. మరోపక్క ప్రోపర్ గా ప్రమోషన్స్ మొదలు కావడం కాస్త ఆనందించే విషయమే. షూటింగ్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిపించేస్తే.. పండగ ఇంటర్వూస్ లో నాగ్, ఇంకా అల్లరి నరేష్, రాజ్ తరుణ్, హీరోయిన్ ఆషిక రంగనాధన్ లు బిజీగా గడుపుతారని సమాచారం.

Naa Saami Ranga to complete its shoot soon:

Nagarjuna Naa Saami Ranga shooting update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs