Advertisement
Google Ads BL

అప్పుడు కాంతార ఇప్పుడు కాటేరా


కన్నడలో చిన్న సినిమాగా 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన రిషబ్ శెట్టి కాంతార కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో దానిని మిగతా ప్యాన్ ఇండియా లాంగ్వేజెస్ లో డబ్బింగ్ చేసి విడుదల చెయ్యగా 400 కోట్లు కొల్లగొట్టింది. చిన్న సినిమాగా విడుదలైన కాంతార బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే తరహాలో కన్నడ నుంచి వచ్చిన కాటేరా కూడా అందరి నోళ్ళలో నానుతుంది. దర్శన్ హీరోగా వచ్చిన కాటేరా డిసెంబర్ 29వ కన్నడ థియేటర్లకు వచ్చింది. ఫస్ట్ షో తోనే సక్సెస్ టాక్ తెచ్చుకుంది. 

Advertisement
CJ Advs

45 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన రోజే భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. ఇప్పటికి బాక్సాఫీస్ దగ్గర అదే జోరును కొనసాగిస్తూ వెళుతోంది. 

దర్శన్ హీరోగా తరుణ్ సుధీర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్ కథకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. 1970లలో హంపీలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా రూపొందింది. 

దర్శన్ కెరియర్ లోనే కాటేరా పెద్ద హిట్ అని చెబుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సలార్ గురించి ఎంత టాపిక్ అయితే నడుస్తుందో.. కాటేరా గురించి కూడా అంతే టాపిక్ నడుస్తుంది. కంటెంట్ పరంగా కాంతార సరసన కాటేరా నిలుస్తుంది అంటూ ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే.. మౌత్ టాక్ ఈ చిత్ర కలెక్షన్స్ పెరగడానికి మరింత దోహదపడింది. 

Kaatera public talk:

Darshan Kaatera movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs