Advertisement

కాంగ్రెస్‌లో చేరిన షర్మిల.. వాట్ నెక్స్ట్!


కాంగ్రెస్‌లో చేరిన షర్మిల..

Advertisement

వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం ఉదయం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ చేరికతో వైఎస్సార్టీపీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్‌లో వైసీపీని విలీనం చేశామని కూడా వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా నిబద్ధతో పనిచేస్తానని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ అంశమే ఆసక్తికరంగా మారింది. అంటే ఏపీ బాధ్యతలు అప్పగించినా ఆమె స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పకనే చెబుతున్నారని అంతా భావిస్తున్నారు.

కాంగ్రెస్‌లో వైఎస్సార్ గొప్ప నేత..

ఇక ఈ సందర్భంగా షర్మిల తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని సైతం గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గొప్ప నేత అని.. ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలూ శ్రమించారన్నారు. దేశంలోనే అతి పెద్ద సెక్యులర్ పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెసేనన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలనూ కలుపుకుని పని చేస్తుందని షర్మిల అన్నారు. మణిపూర్‌లో చర్చిల కూల్చివేతపై కూడా షర్మిల స్పందించారు. ఒక క్రిస్టియన్‌గా తనను చర్చిల కూల్చివేత ఎంతగానో బాధించిందన్నారు. సెక్యులర్ పార్టీ అధికారంలో లేకుంటే ఇలాంటివే జరుగుతాయన్నారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు.

ఏపీ పగ్గాలు పట్టడం ఖాయం..! 

కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించి తెలంగాణలో పోటీ చేయలేదని షర్మిల వెల్లడించారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నది తన తండ్రి వైఎస్సార్‌ ఆశయమని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కాగా.. ప్రస్తుతం షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పగించాలని రాహుల్ భావిస్తున్నట్టు సమాచారం. అయితే కాంగ్రెస్‌లోకి షర్మిల రాకను ఇద్దరు మాజీ ఎంపీలు మినహా అందరూ స్వాగతించినట్టుగా తెలుస్తోంది. అయితే ఆ ఇద్దరు మాజీ ఎంపీలు ఎవరనేది మాత్రం తెలియరాలేదు. మొత్తానికి త్వరలోనే షర్మిల ఏపీ పగ్గాలు పట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.

Sharimla joins Congress:

Sharmila merges YSRTP with Congress
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement