రవితేజ ఈగల్ సంక్రాంతి రిలీజ్ అంటూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే ప్రకటించారు. దసరాకి టైగర్ నాగేశ్వరావు తో నిరాశపరిచిన రవితేజ.. సంక్రాంతికి ఈగల్ తో ఎలాగైనా హిట్ కొట్టాలని.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ట్రైలర్ కూడా రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసాడు. కానీ ఇప్పుడు చూస్తే సంక్రాంతి కి గట్టి పోటీ ఎదురైంది. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామిరంగా సినిమాలు హోరా హోరీగా తలపడుతున్నాయి. అయితే ఇప్పడు ఇంత హెవీ కాంపిటీషన్ లో ఈగల్ ని నిలపాలా.. లేదంటే సింగిల్ రిలీజ్ కి వెళ్లాలా అనే ఆలోచనలో ఈగల్ మేకర్స్ ఉన్నట్లుగా రోజుకో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఈగల్ పొంగల్ బరి నుంచి తప్పుకోవచ్చు, అది జనవరి 26 కి రావొచ్చని ఒకరు, ఈగల్ థియేటర్స్ నాగార్జున నా సామిరంగాకి కేటాయిస్తున్నారంటూ మరొకరు, ఈగల్ పునరాలోచన అంటూ ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్నాయి. మరోపక్క మేకర్స్ ఈగల్ కి సెన్సార్ కంప్లీట్ అంటూ యు/ఏ సర్టిఫికెట్ తో జనవరి 13 నే ఈగల్ రిలీజ్ అనే పోస్టర్ విడుదల చెయ్యడం ఇదంతా రవితేజ అభిమానులకి గందరగోళంగా కనిపిస్తుంది.
మరి నిజంగా ఈగల్ పొంగల్ బరి నుంచి తప్పుకోకపోతే ప్రమోషన్స్ ఎందుకు ఆపేస్తారు. సంక్రాంతి సినిమాల ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి.. ప్రస్తుతం రవితేజ అలికిడి కనిపించడం లేదు అనేవాళ్లూ ఉన్నారు. మరి ఈ కన్ఫ్యూజన్ ఏమిటో మేకర్స్ త్వరగా తెలిస్తే బావుంటుంది లేదంటే ఫాన్స్ లో అయోమయం మరింత పెరిగిపోతుంది.