Advertisement
Google Ads BL

ఏంటి.. దేవర మల్టీస్టారరా?


2024 సంవత్సరంలోని మోస్ట్ ఎవెటెడ్ మూవీస్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న దేవర చిత్రం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ సినిమాపై ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. యంగ్ టైగర్ కెరీర్‌లోనే హై బడ్జెట్, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఏదో రకంగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమాపై వైరల్ అవుతోన్న వార్త వింటే.. దేవర మల్టీస్టారరా? అని ఆశ్చర్యపోకమానరు.

Advertisement
CJ Advs

అవును.. దేవర సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే కాకుండా మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నాడట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ. దేవర బ్రదర్‌ సూరిగాడుగా విజయ్ దేవరకొండ ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడనేలా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దేవర పార్ట్ 2లో విజయ్ దేవరకొండ పాత్ర బాగా హైలెట్ అవుతుందని, మొదటి పార్ట్ ఎండింగ్‌లో వచ్చే ట్విస్ట్ సూరి పాత్రదే అనేలా టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. 

మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందనేది తెలియదు కానీ.. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ మళ్లీ మల్టీస్టారరే చేస్తున్నాడని అంతా అనుకుంటున్నారు. దీనిపై మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. జాన్వీకపూర్ హీరోయిన్‌గా పరిచయం అవుతోన్న ఈ చిత్రంలో విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ వంటి వారు ఇతర పాత్రలలో కనిపించనున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 2024 ఏప్రిల్ 5 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దేవర పార్ట్ 1 గ్లింప్స్‌ని జనవరి 8న విడుదల చేయబోతున్నట్లుగా నూతన సంవత్సరం రోజు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

One More Star Hero in Young Tiger NTR Devara Movie:

Vijay Deverakonda Key Role in Devara Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs