తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా రాణించలేరు, అందం, అణుకువ, గ్లామర్ అన్ని ఉన్నా ఎందుకో తెలుగు హీరోయిన్స్ టాప్ పొజిషన్ కి చేరుకోలేకపోయారు. ఇది వాస్తవం కూడా. పద్దతి పక్కనబెట్టి గ్లామర్ చూపిస్తున్నా వాళ్ళకి వర్కౌట్ అవ్వడం లేదు. అలాంటి వారిలో ఈషా రెబ్బ ముందు వరసలో ఉంటుంది. వరసగా సినిమాలు చేస్తుంది.. కానీ ఆమెకి అనుకున్నంత పేరు రావట్లేదు, మీడియం రేంజ్ హీరోల అవకాశాలూ తగలడం లేదు. సోషల్ మీడియాలో గ్లామర్ చూపిస్తున్నా పని జరగట్లేదు.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఫోటో షూట్స్ షేర్ చేసే ఈషా రెబ్బ న్యూ ఇయర్ కి ఎక్కడికో వెకేషన్ కి వెళ్లి సముద్రంలో చిల్ అవుతున్న పిక్స్ వదిలింది. అందానికి అందం, గ్లామర్ కి గ్లామర్ తో కవ్వించింది. ఇలాంటి పిక్స్ చూస్తే అయ్యో ఇంత అందముంది, కానీ కూసింత అదృష్టము ఉంటే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశమొచ్చేది అంటున్నారు. అది నిజమే.. అందానికి, గ్లామర్ కి పిడికిదంత లక్కు కూడా కలిసి రావాలి.
ఇక గత ఏడాది జేడీ చక్రవర్తితో కలిసి దయ వెబ్ సీరీస్ లో నటించింది. అది మంచి హిట్ అయ్యింది. ఆ దయ సీరీస్ కి పార్ట్ 2 కూడా ఉంది. అందులో ఈషా రెబ్బ కేరెక్టర్ మరింత హైలెట్ కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇవే కాకుండా ఇంకా కొన్ని సినిమాల్లో కూడా నటిస్తుంది.