చాలామంది విమాన సర్వీసులు, దానికి సంబందించిన సిబ్బంది వలన ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. ఎంతగా ఫ్లైట్ జర్నీ చేసినా, వారిలో ఇబ్బంది పడిన వారు సెలబ్రిటీస్ అయితే స్పందిస్తారు తప్ప, సామాన్య మానవులు స్పందించినా అది పెద్దగా న్యూస్ అవ్వదు. వారు కూడా మనకెందుకులే అని కామ్ గా ఉంటారు కానీ పెద్దగా రియాక్ట్ అవ్వరు. అయితే తాజాగా మలయాళీ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ ఇండిగో ఫ్లైట్ సిబ్బందిపై ఫైర్ అయ్యింది.
మాళవిక మోహనన్ తన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఇలా ట్వీట్ చేసింది. వెరీ రూడ్ అండ్ బ్యాడ్ బిహేవియర్, ఇండిగో జైపూర్ బ్యాడ్ స్టాఫ్ (Very rude and bad service @IndiGo6E Jaipur. Bad staff bihevier ) అంటూ ఇండిగో సర్వీస్ పై విరుచుకుపడింది. మరి మాళవికకి ఆ ఇండిగో స్టాఫ్ నుంచి ఎలాంటి ఇబ్బంది ఎదురయ్యిందో ఆమె ఇంత ఆగ్రహంతో స్పందించింది అంటున్నారు. ఇక మాళవిక మోహనన్ తెలుగులో ప్రభాస్-మారుతి మూవీలో నటిస్తుంది. అలాగే తమిళ, మలయాళ చిత్రాలతో ఈ బ్యూటీ బాగా బిజీ గా ఉంది.