సలార్ తో 100 ల కోట్లు కొల్లగొడుతున్న ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే ప్యాన్ ఇండియా ప్రేక్షకుల్లో మాములు అంచనాలు లేవు. మూడు ప్లాప్ లు ఉన్నా ప్రభాస్ సినిమా వస్తుంది అంటే యూత్, మాస్ ఆడియన్స్ మొత్తం థియేటర్స్ కి పరుగులు పెట్టారు. అక్కడే ప్రభాస్ రేంజ్ ఏమిటో ప్రూవ్ అయ్యింది. ఇక ప్రభాస్ నుంచి తదుపరి మూవీగా కల్కి రాబోతుంది. అసలైతే కల్కి జనవరి 12 నే విడుదల కావాల్సి ఉంది. ఇప్పుడు ఆ డేట్ ని సమ్మర్ కి పోస్ట్ పోన్ చేసారు.
ఆ తర్వాత ప్రభాస్ మారుతి మూవీ కంప్లీట్ చెయ్యగానే సందీప్ వంగాతో స్పిరిట్ సెట్స్ లోకి వెళ్ళిపోతారు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ మూవీస్ తో టాప్ లిస్ట్ లో చేరిన సందీప్ వంగాతో ప్రభాస్ ఎప్పుడెప్పడు మూవీ మొదలు పెడతాడా అని అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ ని మళ్ళీ పవర్ ఫుల్ మాస్ అవతార్ లో చూసే అవకాశం వస్తుంది అని. సందీప్ రెడ్డి హీరోలని అలా ప్రెజెంట్ చేస్తాడు కాబట్టి. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ కేరెక్టర్ లో కనిపిస్తారని సందీప్ ఎప్పుడో రివీల్ చేసాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సందీప్ వంగ మాట్లాడుతూ..
ప్రభాస్ స్పిరిట్ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా చాలా నిజాయితీగా కనిపిస్తాడు. స్పిరిట్ కి సంబందించిన కథ ఆల్మోస్ట్ పూర్తయ్యింది. కొన్ని సన్నివేశాల కూర్పు, కథలోని చిన్న మార్పులు మాత్రమే మిగిలి ఉంది.. అంటూ సందీప్ రెడ్డి స్పిరిట్ పై ఇచ్చిన చిన్నపాటి అప్ డేట్ సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది.