గత ఏడాది శాకుంతలం షాక్ తర్వాత ఖుషి తో హిట్ అందుకుని.. ఆ చిత్రంలో లుక్స్ వైజ్ గా విమర్శల పాలయిన సమంత ఆ తర్వాత బాలీవుడ్ వెబ్ సీరీస్ సిటాడెల్ షూటింగ్ కూడా ముగించేసి నటనకు బ్రేకులు వేసేసింది. హెల్త్ పరంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ సోషల్ మీడియాకి దగ్గరగానే ఉంటుంది. సమంత నటనకు దూరంగానే ఉన్నప్పటికీ.. ఫోటో షూట్ విషయంలో ఎలాంటి గ్యాప్ తీసుకోవడం లేదు. అది కూడా గ్లామర్ గా సమంత రెచ్చిపోతూనే ఉంది.
ఏడాది చివరి రోజుల్లో 100 కేజీల బరువు ఎత్తుతున్న వర్కౌట్ వీడియో షేర్ చేసిన సమంత కొత్త ఏడాది మొదలు కాగానే గ్లామర్ డోస్ పెంచి మరీ తగ్గేదేలే అంటుంది. సమంత దర్శక నిర్మాతలకి సిగ్నల్స్ ఇస్తుందా.. లేదా ఇంకేదన్నానా అనేది తెలియడం లేదు. కారణం సమంత ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్స్ ఒప్పుకోవడము లేదు, అలాగని కథలు వినడమూ లేదు. మరి ప్రస్తుతం సింగిల్ గా లైఫ్ లీడ్ చేస్తూ ఆరోగ్యపరమైన సమస్యలను చక్కబెట్టుకుంటున్న సమంత కి ఈ ఏడాది బాగుండాలని ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం.