హీరో శ్రీవిష్ణు గత ఏడాది సామజవరాగమన తో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. సాలిడ్ గా మేకర్స్ కి లాభాలు అందించాడు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సామజవరాగమన మూవీని ప్రేక్షకులు విపరీతంగా ఆదరించడంతో చిన్న సినిమా కాస్తా పెద్ద హిట్ అయ్యి కూర్చుకుంది. ఆ చిత్రం తర్వాత శ్రీవిష్ణు వరస సినిమాలతో బిజీ అయ్యాడు. తాజాగా శ్రీవిష్ణు నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ సెట్స్ లో అనుకోని సంఘటన శ్రీవిష్ణుకి ఎదురైంది.
శ్రీ విష్ణు కారుని కొంతమంది కూలీలు అడ్డగించి రచ్చ చేసిన సంఘటన బనగానపల్లె నంద్యాల యాగంటి క్షేత్రంలో జరిగింది. అసలు విషయం ఏమిటంటే శ్రీ విష్ణు సినిమా షూటింగ్ కోసం మేకర్స్ 400 మంది కూలీలని తీసుకుని వచ్చి వావరితో పని చేయించుకుని పేమెంట్ ఇవ్వడం లేట్ చెయ్యడంతో.. వారు ఆందోళన చేస్తూ అటుగా వస్తున్న హీరో శ్రీవిష్ణు కారుని అడ్డగించినట్లుగా తెలుస్తుంది. దానితో పోలీస్ లు రంగంలోకి దిగి వాళ్ళ వేతనానికి శ్రీ విష్ణుకి ఎలాంటి సంబంధం లేదని చెప్పడంతో వారు శ్రీ విష్ణు కారుని వెళ్ళనిచ్చినట్లుగా సమాచారం.
ఆ తర్వాత నిర్మాతలు ఆ కూలీలకు డబ్బుని సర్దుబాటు చెయ్యడంతో అక్కడితో ఆ సమస్య పరిష్కారం అయినట్లుగా తెలుస్తోంది.