టాలీవుడ్ కి లక్కీ హీరోయిన్ గా మారిన సంయుక్త మీనన్ కి ఇక్కడ వరస హిట్స్ ఉన్నాయి. కళ్యాణ్ రామ్ తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన సంయుక్తకి బింబిసారా, సాయి ధరమ్ తే తో చేసిన విరూపాక్ష, ధనుష్ సర్ మూవీస్ మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి. రీసెంట్ గా కళ్యాణ్ రామ్ తోనే డెవిల్ తో హిట్ కొట్టింది. ఈచిత్రం ఇంకా థియేటర్స్ లో రన్ అవుతుంది. అయితే వరస సక్సెస్ లు సాధిస్తున్న సంయుక్త మీనన్ పెళ్లి మేటర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఎందుకంటే సంయక్త మీనన్ డెవిల్ తర్వాత తెలుగులో కానీ, ఇతర భాషల్లో కానీ ఏ ఒక్క ప్రాజెక్ట్ కి సైన్ చెయ్యలేదు. అసలు ఏ ప్రాజెక్ట్ ఒప్పుకున్న దాఖలాలు లేకపోవడంతో.. సంయుక్త మీనన్ 2024 లో పెళ్లి పీటలెక్కడానికే సినిమాలు ఒప్పుకోవడం లేదేమో అనే అనుమానాలు రేకెత్తాయి. యంగ్ అండ్ స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వకపోయినా.. మీడియం రేంజ్ హీరోలు ఆమెకి అవకాశాలు ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నటనతో మెప్పిస్తూ హిట్స్ సాధించింది.
మరి ఇంత సక్సెస్ ఫుల్ హీరోయిన్ కి ఇప్పుడు అవకాశాలు తలుపు తట్టకో.. లేదంటే పెళ్లిపై నిజంగా మనసు పారేసుకుందో కానీ.. ఆమె ఈఏడాది మాత్రం ఇంకా ఏ కొత్త ప్రాజెక్ట్ కి సైన్ అయితే చెయ్యలేదు.