Advertisement
Google Ads BL

బీఆర్ఎస్‌కు మరో షాక్.. ఈ లిస్ట్ చూశారో!


ఇప్పటికే తెలంగాణ ఎన్నికల్లో అపజయాన్ని ఎదుర్కొని పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన బీఆర్ఎస్ పార్టీపై సోషల్ మీడియా వేదికగా విమర్శనాస్త్రాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే మొన్న కేటీఆర్.. కేసీఆర్ మెడికల్ కాలేజీలకు బదులు యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసి ఉంటే బాగుండేదంటూ సెటైర్ వేశారు. ఈ కామెంట్ నెట్టింట తెగ వైరల్ అయ్యింది. అధికారాన్ని కోల్పోయిన పరిస్థితులను జీర్ణించుకోలేక కేటీఆర్ అలా కామెంట్ చేశారంటూ ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో మరో పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది.

Advertisement
CJ Advs

మహిళలు ఉచితంగా బస్సులలో ప్రయాణిస్తూ.. చూడవల్సిన ప్రదేశాల లిస్ట్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సంక్రాంతి సెలవుల్లో ప్రతి ఆడబిడ్డ చూడవల్సిన ప్రదేశాల లిస్ట్‌ను కొందరు పెడుతున్నారు. ఈ లిస్ట్ బీఆర్ఎస్‌కు షాక్ ఇస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్‌ పార్టీ అగ్ర నేతలకు సంబంధించిన కొన్ని కీలక విషయాలను జనం తెలుసుకోవాలంటూ పోస్టులు పెడుతున్నారు. కేటీఆర్ సంస్థానం ఎక్కడ? కవితకు ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి? వంటి అంశాలను ప్రశ్నలుగా సంధించారు. ఇవన్నీ ఫ్రీ బస్సులలో తిరుగుతూ మహిళలంతా చూసి ఈ తెలంగాణ సమాజానికి చెప్పాలట.   

నెట్టింట వైరల్ అవుతున్న లిస్ట్ ఇదే..

మేడిగడ్డ - ఎలా కుంగింది..?

KCR ఫామ్ హౌస్ - ఎన్ని ఎకరాలు..?

కవితక్క- ఇల్లు .. ప్యాలెస్

కేటీఆర్ సంస్థానం ఎక్కడుంది..?

హరీష్ రావుకు ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి?

2014కి ముందు వీళ్ళ ఆస్తులెన్ని...?

ఇప్పుడు వీళ్ళ ఆస్తులు ఎలా పెరిగాయి...?

వీళ్ళ పదవులకు వచ్చే జీతం ఎంత...?

కిరాయి కొంపలో ఉన్న కవితకు దుబాయిలోని బురుజు ఖలిఫాలో ఇల్లు ఎలా వచ్చింది...?

వేల ఎకరాల ఫామ్ హౌస్ లాంటివి ఎలా వచ్చాయి?

కోట్లాది రూపాయల విలువైన విలాసవంతమైన భవనాలు ఎలా వచ్చాయి?

లగ్జరీ కార్లు ఎన్ని..? 

చేతి గడియారాల ఖరీదు ఎంత..?

Another shock for BRS:

Another Big Shock to BRS Party
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs