ఒకప్పుడు సూపర్ స్టార్ మహేష్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తేజ సజ్జా.. మళ్ళీ 23 ఏళ్ళకి హీరోగా మహేష్ తో పోటీకి సిద్దమయ్యాడు. మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జల హనుమాన్ జనవరి 12 సంక్రాంతికి పోటీ పడుతున్న చిత్రాల్లో ఉండడంతో.. 2000 సంవత్సరంలో మహేష్ బాబు కొడుకుగా యువరాజు సినిమాలో కనిపించిన తేజ సజ్జా 23 ఏళ్ళ తర్వాత హీరోగా మారి ఆ మహేష్ నే ఢీ కొట్టడం ఇంట్రెస్టిగ్ గా మారడమే కాదు.. సోషల్ మీడియాలోనూ అదే మాట్లాడుకుంటున్నారు.
అది చూసిన తేజ సజ్జా.. సోషల్ మీడియా వేదికగా ఫన్నీ రిప్లై ఇచ్చాడు.. #SuperStar tho poti enti sir 🤦♂️🙏 ఆయనతో తో పోటీగా కాదు సర్, ఆయనతో పాటుగా అంటూ ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి జనవరి 12 గుంటూరు కారం, అదే రోజు హనుమాన్, జనవరి 13 వెంకీ మూవీ, రవితేజ ఈగల్, జనవరి 14 న నా సామిరంగా సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీపడుతున్నాయి. అందులో చిన్న సినిమా అంటూ హనుమాన్ ని పోటీ నుంచి తప్పుకోమని బెదిరింపులు వచ్చినా.. హీరో తేజ-దర్శకుడు ప్రశాంత్ వర్మ తగ్గేదేలే అంటున్నారు.