ఈ దేశంలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అందిరినీ ఒక్కచోట చేర్చితే.. వారందరిలోనూ ఫస్ట్ ర్యాంక్ నాదే ఉంటుందని.. ఒకానొక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి ఎదురుగా దర్శకుడు సందీప్ వంగా ప్రకటించుకున్నాడు. చిరంజీవి చేతుల మీదుగా అవార్డ్ అందుకున్న ఈ అర్జున్ రెడ్డి దర్శకుడు.. తన డ్రీమ్ నెరవేరిందని ఆ సమయంలో చెప్పుకొచ్చాడు. అయితే జనాలు మాత్రం ఏదో సందీప్ అలా మెగాస్టార్ ఎదురుగా ఉన్నారని.. అలా చెప్పి ఉంటాడని అనుకున్నారు. కట్ చేస్తే.. నిజంగానే మెగాస్టార్‌కి కల్ట్ ఫ్యాన్ అని నిరూపించుకుంటున్నాడు సందీప్ వంగా.
రీసెంట్‌గా ఆయన డైరెక్ట్ చేసిన యానిమల్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకుంది. ఇంకా సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో రన్ అవుతూనే ఉంది. ఈ సక్సెస్‌ను పురస్కరించుకుని పలు ఛానెళ్లు ఆయనని ఇంటర్వ్యూ చేసేందుకు క్యూ కడుతున్నాయి. ఈ ఇంటర్వ్యూలలో మెగాస్టార్ ప్రస్తావన లేకుండా.. సందీప్ వంగా మాట్లాడటం లేదు. ఏదో ఒక సందర్భంలో తనని మెగాస్టార్ ఎలా ఇన్‌స్ఫైర్ చేశారనేది చెబుతూనే ఉన్నారు. మెగాస్టార్ గురించి సందీప్ రెడ్డి వంగా చెప్పే మాటలు చూస్తుంటే.. చిరంజీవికి వీరభక్తులం అనుకునే వాళ్లు కూడా ఆశ్చర్యపోతున్నారు.
రీసెంట్‌లో ఓ ఇంటర్వ్యూలో మాస్టర్ సినిమాలోని ఓ సందర్భం గురించి చెబుతూ.. ఆ సన్నివేశంలో చిరంజీవి ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడో కూడా సందీప్ చెప్పుకొచ్చాడు. సిగరెట్ కాల్చే సందర్భం గురించి చెబుతూ.. మాస్టర్ సినిమాలో చిరు, సాక్షి శివానంద్‌ల మధ్య వచ్చే సన్నివేశంలో చిరు గ్రీన్ షర్ట్ వేసుకుని.. సిగిరెట్ కాల్చే తీరు తనపై ఎంతో ప్రభావం చూపిందని.. అది అలా తనకి గుర్తుండిపోయిందని, వెంటనే నేను స్టార్ట్ చేసేలా చేసిందని సందీప్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోకి మెగా ఫ్యాన్స్ అంతా.. షర్ట్ కలర్‌తో సహా ఎలా సామి.. నువ్వు నిజంగా బాస్‌కి కల్ట్ ఫ్యాన్‌వే, బాస్‌తో ఒక సినిమా ప్లాన్ చెయ్ అన్నా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారంటే.. మెగాస్టార్‌కి సందీప్ ఎలాంటి వీరాభిమానో అర్థం చేసుకోవచ్చు.