ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ కలయికలో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన హనుమాన్ తీవ్ర పోటీ నడుమ సంక్రాంతికి విడుదల కాబోతుంది. జనవరి 12 నే గుంటూరు కారంతో పోటీపడుతున్న హనుమాన్ మూవీని సంక్రాంతి బరి నుంచి తప్పుకోమని ఒత్తిడి వస్తున్నా మేకర్స్ పట్టుబట్టుకుని కూర్చున్నారు. అలాగే హనుమాన్ ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. దానితో చిన్న సినిమా, చిన్న హీరో అనుకున్నవాళ్ళు ఇప్పుడు హనుమాన్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
అయితే హనుమాన్ మూవీలో మెగాస్టార్ చిరు ఉన్నారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హనుమాన్ ట్రైలర్లో చివరి షాట్ లో హనుమంతుడిగా కళ్ళు తెరిచినప్పుడు అవి చిరు కళ్ళే ... హనుమాన్ లో చిరు కూడా ఉన్నారు, హనుమంతుడు పాత్రని ఆయనే చేసారని అంటున్నారు. ఆ విషయమై దర్శకుడు ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇస్తూ సస్పెన్స్ క్రియేట్ చేసాడు. అవి ఎవరి కళ్ళు అనేది నేను చెప్పను, ఈ సినిమా కోసం రెండున్నరేళ్లు కష్టపడ్డాం.
మీకు అవి చిరంజీవి గారి కళ్ళు లాగా కనిపించొచ్చు, కానీ ఆ విషయం నేను చెప్పను, అది హనుమాన్ లో చూసి మీరు థ్రిల్ ఫీలవ్వాల్సిందే అంటూ ప్రశాంత్ వర్మ చిరు విషయంలో మరింత సస్పెన్స్ పెంచేసాడు.