ఫైనల్ గా రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోబోతుంది. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పిన రకుల్ ప్రీత్ సింగ్.. గత మూడునాలుగేళ్ళుగా తెలుగు ప్రేక్షకులకి కనిపించకుండా కనుమరుగైపోయింది. అటు హిందీలో అయినా రకుల్ జెండా పాతుదాం అని చాలానే ట్రై చేసింది. కానీ పాపకి అక్కడ సక్సెస్ మాత్రం దరి చేరలేదు. హిట్ దొరకలేదు కానీ అక్కడో బాయ్ ఫ్రెండ్ దొరికాడు. హీరో కమ్ ప్రొడ్యూసర్ జాకీ భగ్నానీ ప్రేమలో పడిన రకుల్ రీసెంట్ గానే బాయ్ బర్త్ డే ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది.
అయితే జాకీ తో ప్రేమలో ఉండి వెకేషన్స్ అంటూ తిరిగే ఆమె పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో అనే ఆత్రుత మీడియా చూపిస్తే మాత్రం కోపమొచ్చేస్తుంది. మీకెందుకు నేను పెళ్ళెప్పుడు చేసుకుంటే అంటూ కయ్యమంటుంది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను అని చెప్పే రకుల్ కొన్నాళ్లుగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ మరీ పుల్లలాంటి ఫిజిక్ లోకి మారిపోయింది. అయితే ఇప్పుడు రకుల్ ఫైనల్ గా పెళ్ళికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తుంది.. త్వరలోనే ఈ జంట గుడ్ న్యూస్ చెప్పబోతుందట.
ఈ ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన రకుల్పె-జాకీ ళ్లి చేసుకోబోతున్నారట. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నానీలు.. గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని భావిస్తున్నారని బాలీవుడ్ మీడియాలో కథనాలు ఆరంభమయ్యాయి. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారని టాక్ నడుస్తోంది. మరి ఇదే నిజం అయితే ఈ ఏడాది మొదటి సెలబ్రిటీ పెళ్లి ఇదే అవుతుందని అంటున్నారు.