Advertisement
Google Ads BL

బిగ్ బాస్, నాగ్ పై ఫైరవుతున్న శివాజి


నటుడు శివాజీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం కోసం బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి మాస్టర్ మైండ్ తో చాణక్యగా పెద్దరికం చూపించడంతో చాలామంది శివాజీని లైక్ చేసారు. కానీ శివాజీ హౌస్ లో స్పై బ్యాచ్ ప్రశాంత్, యావర్ లతో కలిసి వేరే వాళ్ళని టార్గెట్ చెయ్యడమే కాకుండా.. సెలెబ్రిటీస్ అంటూ సీరియల్స్ ఆర్టిస్ట్ లని అవమానించడం బుల్లితెర ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకోలేక.. శివాజీని టాప్ 3 కే పరిమితం చెయ్యడం తో శివాజీ ఆ విషయంలో కక్కలేక మింగలేక ఉన్నాడు.

Advertisement
CJ Advs

అయితే కొద్దిరోజులుగా వరస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న శివాజీ బిగ్ బాస్ యాజమాన్యంపై, అలాగే హోస్ట్ నాగార్జునపై ఫైరయ్యాడు. నాగార్జున బాబు గారిపై గౌరవం నా గుండెల్లో ఉంది. కానీ, నా క్యారెక్టర్ పోతున్నప్పుడు భగవంతుడు ఉన్నా తలదించుకోకుండా ప్రశ్నిస్తాను. బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత నన్ను విలన్ చేయడానికి ప్రయత్నించారని కొన్ని ఎపిసోడ్స్ చూస్తే నాకు అర్థం అయింది. అదే క్రమంలో కొంతమందిని హీరో చేయడానికి ప్రయత్నించారు. అసలు ఎందుకలా అని నాకు ఇప్పటికీ అర్థం కాలేదు.

నన్ను పన్నెండో వారం నుంచి విలన్‌గా చూపించే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా నా స్క్రీన్ స్పేస్ కూడా చాలా తగ్గించారు. దీనిపై నేను ఎవరి దగ్గర క్లారిటీ తీసుకోవాలో వారి దగ్గరే తీసుకుంటాను, అమ్మాయిల గొడవ విషయంలో నేను ప్రశ్నించింది బిగ్ బాస్‌ను మత్రమే. కానీ నేను బ్రతికి ఉన్నంతవరకు బాబుగారిని ప్రశ్నించే ధైర్యం చేయను. నాకు అక్కడ కనిపించింది బాబు గారు కాదు.. బిగ్ బాస్ మాత్రమే అంటూ .. శివాజీ బిగ్ బాస్ పై ఫైరవుతూనే నాగార్జున పై ఇండైరెక్ట్ కామెంట్స్ చేసాడు. 

Sivaji firs on Nag and Bigg Boss :

Sivaji firing on Nag and Bigg Boss management
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs