Advertisement

2023.. మరకలు మంచివి కావు జగనన్నో..!


మిగిలిన రాష్ట్రాల మాటేమో కానీ ఏపీకి కీలకమైన ఏడాది మాత్రం 2023. ఎందుకంటే వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఆ ఎన్నికల్లో గెలుపోటములను డిసైడ్ చేసే ఏడాది ఇదే కాబట్టి ఏపీకి అత్యంత కీలకం. మరి ఈ ఏడాది వైసీపీకి ఎలా ఉంది? అనేది ప్రశ్న. మరక మంచిదే అంటూ ఓ యాడ్ వస్తుంది కానీ ఏపీ సీఎం జగన్‌కు ఒక్కటి కాదు చాలా మరకలు అంటుకున్నాయి. జగనన్నకు అంటుకున్న మరకలు మాత్రం మంచివి కావు. ఏపీ ఎంత అభివృద్ధి చెందిందా? అని ఒక్కసారి వెనుదిరిగి చూస్తే ఏపీలో మోకాలు లోతు గోతులు తప్ప ఏమీ కనబడటం లేదు. పోనీ ఎత్తైన కొండలున్నాయా అని తలను కాస్త సైడ్‌కి తిప్పి చూస్తే వాటికి గుండే మిగిలింది.

Advertisement

ఉద్యోగాలు లక్షల్లో అని చెబుదామా?

ఇదేందిరా బాబోయ్ అని రాజధాని వంక చూస్తే బీడువారిన పొలంలా మారింది. విశాఖ రాజధానంటూ రంకెలేశారు కానీ అది కూడా హుళక్కే. ఢిల్లీ లిక్కర్ స్కాంలోనూ వైసీపీ నేతలే.. హత్యలు చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేయడంలోనూ వైసీపీ వారే.. బాబాయిని చంపిన కేసులో నిందితులు వైసీపీ అగ్రనేతలు.. పోనీ గొప్పగా విశాఖలో రెండు రోజుల పాటు గ్లోబర్ సమ్మిట్‌ను అంగరంగ వైభవంగా జరిగింది. పెట్టుబడులు కోట్లలో.. ఉద్యోగాలు లక్షల్లో అని చెబుదామా? నేటికీ అవేవీ అతీగతీ లేదు. పైగా ఆ సమ్మిట్ కోసం పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరే. గుర్తు చేసి మరీ తిట్టించుకోవడమెందుకని ఆ ఊసే ఎత్తడం లేదు. బాబాయి హత్యను ప్రతిపక్షాలపై వేసి అప్పట్లో చేయి దులుపుకున్నారు.

వారంతా జంప్..

అన్నీ అగచాట్లే కాబట్టి ప్రతిపక్ష నేతకు అవినీతి మరక అంటించి జైలు పాలు చేసి లబ్ది పొందుదామంటే అది బ్యాక్ ఫైర్ అయిపోయింది. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించడమే అతి పెద్ద తప్పు అని తరువాతి పరిణామాలతో వైసీపీకి తెలిసొచ్చింది. ఇక ఏం చేయాలో తెలియక.. ఏదో ఒకటి చేసేద్దామని తెలంగాణ నుంచి పాఠాన్ని నేర్చుకున్నామనుకుంటే.. అది కూడా సరిగా అర్థం చేసుకోలేకపోయారు. బీఆర్ఎస్ ఓటమికి ముఖ్యంగా కొన్ని కారణాలున్నాయి. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని చూడాలి కానీ ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యేల అంశాన్నే జగన్ పట్టుకుని వేలాడుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలకు హ్యాండ్ ఇస్తుంటే వారంతా జంప్ అవుతున్నారు. మొత్తానికి 2023 జగన్‌కు దారుణమైన దెబ్బ కొట్టింది. 

2023.. Stains are not good at all Jagananna..!:

2023 dealt a terrible blow to Jagan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement