బిగ్ బాస్ సీజన్ 7 లో మాస్టర్ మైండ్ తో గేమ్ ఆడుతూ హౌస్ లో పెద్దరికం చూపించిన శివాజీకి బయట ఫ్యాన్ ఫాలింగ్ బాగా వచ్చేసింది. ఒకప్పుడు నటుడిగా క్రేజీగా కనిపించిన శివాజీ కొన్నాళ్లుగా నటనకు దూరమయ్యాడు. ఆ తర్వాత పాలిటిక్స్ లో బిజీగా మారినా.. మళ్ళీ పొలిటికల్ గా డల్ గా కనిపించిన శివాజీ చివరికి బిగ్ బాస్ 7 లో చేరాడు. అక్కడ కప్ కొడతాడు అనుకుంటే అమ్మాయిల విషయంలో మాట్లాడిన మాటలు అతన్ని టాప్ 3 కి పరిమితం చేసాయి.
అయితే బిగ్ బాస్ సీజన్ 7 ఫినిష్ అయ్యి పల్లవి ప్రశాంత్ అంటే శివాజీ శిష్యుడు కప్ కొట్టాక జరిగిన రచ్చ తర్వాత అతను జైలు నుంచి విడుదలయ్యాక పార్టీలు అవి చేసుకుని ఇప్పుడు శివాజీ వరసగా ఇంటర్వూస్ ఇస్తున్నాడు. ఆ ఇంటర్వ్యూలో పల్లవి ప్రశాంత్ మంచివాడు, అతను బయట ఎలా ఉండాలో తెలియకపోవడంతోనే ఈ చిన్నపాటి డిస్టబెన్స్ జరిగింది. అందరూ నేను కప్ కొడతా అనుకున్నారు కానీ నా బిడ్డ కొట్టాడు. నాకు హ్యాపీ. ఇక నన్ను, యావర్ ని, పల్లవి ప్రశాంత్ ని స్పై బ్యాచ్ అన్నారు. ఆ పేరు బాగా ఫేమస్ అయ్యింది. అందుకే స్పై పేరుతొ నేనొక షార్ట్ ఫిలిం ప్లాన్ చేస్తున్నాను అంటూ ఇంట్రస్టింగ్ న్యూస్ రివీల్ చేసాడు. అందులో శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ కీలకంగా కనిపిస్తారని చెప్పాడు.
ఇక స్పా బ్యాచ్ లో ఉన్న అమర్ దీప్ కాస్త మంచివాడు, మిగతా వాళ్ళు గురించి చెప్పను అంటూ శివాజీ షాకింగ్ గా మాట్లాడారు. పావని నయని బిగ్ బాస్ లో ఉండాల్సిన అమ్మాయి. కానీ ఆమె మొదటి వారంలోనే ఎలిమినేట్ అయ్యింది. ఆమెని మరో సీజన్ లోకి తీసుకుంటే బావుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు శివాజీ.