Advertisement
Google Ads BL

మొన్న చిరు - నేడు నాగార్జున


తెలంగాణాలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్లుగా తెలంగాణని పాలిస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని ఇంటికి పంపించి కాంగ్రెస్ కి పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. అసలు తెలంగాణాలోనే కాదు ఏ రాష్ట్రమైన సీఎం పీఠం కోసం తన్నుకు చచ్చే కాంగ్రెస్ ని తెలంగాణ ప్రజలు గెలిపించడం ఒకింత ఆశ్చర్యమే కానీ రేవంత్ రెడ్డి వంటి పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ కాంగ్రెస్ లో ఉండే గొడవలని ఓ కొలిక్కి తెచ్చి సీనియర్ నాయకులందరినీ ఒకేతాటిపై నడిపించి చివరికి తెలంగాణకి సీఎంగా అధికారాన్ని చేపట్టారు. అయితే కేసీఆర్, కేటీఆర్ తో  సినిమా ఇండస్ట్రీ ప్రత్యేకమైన అనుబంధాన్ని మైంటైన్ చేసేది.

Advertisement
CJ Advs

ఇప్పుడు కొత్త ప్రభుత్వంతో సినీ ప్రముఖులు ఎలా ఉంటారో అనుకునేలోపులో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి వచ్చారు. మొన్న చిరు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే.. నేడు శనివారం అక్కినేని నాగార్జున దంపతులు వెళ్లి రేవంత్ ని కలిశారు. రేవంత్ రెడ్డి తో ఆయన ఇంట్లోనే నాగార్జున-అమల వెళ్లి బొకే ఇచ్చి కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మరి చిరు, నాగార్జున వెళ్లి కొత్త సీఎం ని కలిశారు.. వీరి తర్వాత వెళ్లబోయే ఆ సినీ ప్రముఖులెవరో అని అందరూ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు.

Akkineni nagarjuna Meets CM Revanth Reddy:

Nagarjuna with his wife Amala Meets CM Revanth Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs