Advertisement
Google Ads BL

ఉక్కిరి బిక్కిరవుతున్న ప్రభాస్ ఫాన్స్


సలార్ విడుదలముందు వరకు ప్రభాస్ అభిమానులు అప్ డేట్స్ కోసం సోషల్ మీడియాలో గోల గోల చేసారు. సలార్ డిసెంబర్ 22 న విడుదలయ్యింది. అప్పటినుంచి ప్రభాస్ ఫాన్స్ ఆనందపడేలా సలార్ టాక్, సలార్ కలెక్షన్స్ కనిపించాయి. గత వారం రోజులుగా సలార్ కలెక్షన్స్ పోస్టర్ వారిని కూల్ చేసాయి. నిన్నమొన్నటివరకు ప్రభాస్ మూవీ అప్ డేట్స్ కోసం మొహం వాచిపోయిన ప్రభాస్ ఈరోజు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అసలు ఊపిరి పీల్చుకోకుండా అభిమానులని సర్ ప్రైజ్ చేస్తున్నారు ప్రభాస్ తో ప్రాజెక్ట్స్ చేసే మేకర్స్.

Advertisement
CJ Advs

సోషల్ మీడియాలో సలార్ ట్రెండ్ అవుతున్న సమయంలోనే నిన్న మారుతీ తో ప్రభాస్ చేస్తున్న మూవీ నుంచి అప్ డేట్ వచ్చింది. పొంగల్ ప్రభాస్ ట్రీట్ అంటూ ప్రీ లుక్ ని వదిలింది పీపుల్ మీడియా నిర్మాతలు. ఇప్పటివరకు డైనోసార్ ని చూసారు.. ఇప్పుడు డార్లింగ్ ని చూడబోతున్నారంటూ మారుతి ప్రభాస్ అభిమానులకి బిగ్గెస్ట్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. అది ట్రెండ్ అవుతుంది.. మరోపక్క నాగ్ అశ్విన్ IIT లో కూర్చుని ప్రభాస్ తో చేస్తున్న కల్కి 2898 AD మూవీ ముచ్చట్లు రివీల్ చేస్తున్నారు.

కల్కి 2898 అదిట్రైలెర్ 93 రోజుల తర్వాత ఉండబోతుంది, సినిమా వచ్చే వేసవిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా.. త్వరలోనే రిలీజ్ డేట్ లాక్ చేస్తున్నట్లుగా నాగ్ అశ్విన్ చెప్పడంతో.. ప్రస్తుతం సోషల్ మీడియా లో ఎటు చూసినా.. సలార్, మారుతీ-ప్రభాస్ మూవీ, కల్కి 2898 యాడ్ మూవీ హాష్ టాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇవన్నీ చూసి అభిమానులని కాస్త ఊపిరి తీసుకోనివ్వండయ్యా అంటూ నెటిజెన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.

Prabhas fans are being surprised again and again:

Prabhas movie updates 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs