Advertisement
Google Ads BL

NBK109 సెట్స్ లోకి ఊర్వశి-బాబీ డియోల్


అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి చిత్రాల హ్యాట్రిక్ హిట్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ వాల్తేర్ వీరయ్య తో హిట్ కొట్టిన దర్శకుడు బాబీ తో చేతులు కలిపి NBK109 ని మొదలు పెట్టాడు. దసరా సందర్భంగా మొదలైన ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా నవంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళిపోయింది. బాలకృష్ణ చిన్నపాటి బ్రేక్ కూడా తీసుకోకుండా NBK109 షూటింగ్ లో పాల్గొంటున్నారు. 2024 ఏప్రిల్ లో జరగబోయే ఏపీ ఎలక్షన్స్ సమయానికల్లా NBK109 షూటింగ్ కంప్లీట్ చేసి విడుదల చెయ్యాలనే కసితో బాలయ్య ఉన్నారు.

Advertisement
CJ Advs

అయితే NBK109 లో విలన్ గా బాబీ డియోల్ ని ఫైనల్ చేసారు. ఈరోజు శుక్రవారమే బాబీ డియోల్ NBK109 షూటింగ్ సెట్స్ లోకి అడుగుపెట్టారు. ఆయనతో పాటుగా ఊర్వశి కూడా NBK109 కోసం ముంబై నుంచి హైదరాబాద్ కి వచ్చారు. బాబీ డియోల్, ఊర్వశి స్పెషల్ ఫ్లైట్ లో NBK 109 సెట్స్ లో జాయిన్ అయ్యేందుకు వచ్చిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈమధ్యన యానిమల్ మూవీ లో విలన్ గా మెప్పించిన బాబీ ఇప్పుడు బాలయ్యతో తలపడేందుకు సిద్ధమయ్యారు.

Bobby Deol, Urvashi excited for NBK109:

NBK109: Bobby Deol, Urvashi super excited
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs