Advertisement
Google Ads BL

భార్యతో కలిసి నాగ శౌర్య వేరు కాపురం


హీరో నాగ శౌర్య గత ఏడాది అనూష ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. నాగశౌర్య సింపుల్ గా వివాహం చేసుకోవాలనుకున్నా.. అనూష పేరెంట్స్ మాత్రం బెంగుళూరు వేదికగా నాగ శౌర్య-అనుషల వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించారు. ఇక హైదరాబాద్ లో ప్రముఖుల సమక్షంలో నాగ శౌర్య వెడ్డింగ్ రిసెప్షన్ ఉంటుంది అనుకుంటే.. అది కూడా లేకుండా కామ్ గా కనిపించారు. పెళ్లైన వారానికే నాగ శౌర్య తన సినిమా షూటింగ్స్ తో బిజీగా మారిపోయాడు. అనుష్క కూడా ఇంటీరియర్ డిజైనర్ గా ఫుల్ బిజీ.

Advertisement
CJ Advs

అయితే ఉష మూలపురి అంటే నాగ శౌర్య మదర్ రీసెంట్ గా ఉష మూలపురి కిచెన్ అంటూ ఓ రెస్టారెంట్ ని స్టార్ట్ చేసి కొద్దిరోజుల్లోనే ఫేమస్ అయ్యారు. తాజాగా ఆమె ఓ యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ తన కోడలు అనుష్క చాలా తెలివైనది, తనని కోడలిగా కాకుండా కూతురిలా చూసుకుంటాను, ఆమె కూడా నన్ను మమ్మా అని, మా వారిని డాడీ అనే పిలుస్తుంది. నాకు మూడేళ్ళుగా అనూష తెలుసు. నాగ శౌర్య-అనూష మెడ్ ఫర్ ఈచ్ అదర్. నా పెద్ద కోడలు సాఫ్ట్ వేర్, ఆమె అమెరికాలో సెటిల్ అయ్యింది.

అయితే నాగ శౌర్య పెళ్లయ్యాక అనూషతో కలిసి వేరు కాపురం ఉంటున్నాడు. ఈ విషయంలో మాకేమి ప్రాబ్లెమ్ లేదు. పిల్లలు పుట్టి పెద్దవాళ్లవుతున్నప్పుడే మేము అనుకున్నాము, వాళ్ళకి ప్రయవసి ఇవ్వాలని, దూరంగా ఉండి అప్పుడప్పుడు కలుస్తూ ఉంటేనే బావుంటుంది. ఇదిమాకు ముందు నుంచి ఉన్న అభిప్రాయమే, దీని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనేమీ లేదు అంటూ నాగ శౌర్య వేరు కాపురం గురించి ఉషగారు చెప్పుకొచ్చారు. 

Naga Shaurya Mother Usha React To Her Son Separate Family:

Naga Shaurya Mother Usha Prasad React To Her Son Separate Family After Marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs