Advertisement
Google Ads BL

శోభా శెట్టిపై శివాజీ ఫైర్


బిగ్ బాస్ హౌస్ లో గొడవలు, కొట్లాటలు... బయట కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. గతంలో షణ్ముఖ్-సన్నీ ల హౌస్ గొడవ బయట కూడా కనిపించింది. ఇక సీజన్ 2 విన్నర్ కౌశల్, రన్నర్ తనీష్ మధ్యన హౌస్ లోని గొడవలు బయట కూడా కంటిన్యూ అయ్యాయి. కౌశల్ ఆర్మీ-తనీష్ అభిమానుల మధ్యన గొడవలు జరిగాయి. ఇక గత సీజన్ లో హౌస్ లో పదే పదే గొడవ పడిన గీతూ రాయల్-చంటిలు.. బయట కూడా ఆ గొడవని కొనసాగించారు. రీసెంట్ గా చంటి అన్నని బయట పలకరించగానే మొహం తిప్పేసుకున్నాడు, అప్పుడు నాకు చాలా కోపమొచ్చింది అంటూ గీతూ రాయల్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

Advertisement
CJ Advs

ఇక సీజన్ 7 లో హౌస్ లో అమ్మాయిలైన శోభా శెట్టి, ప్రియాంక జైన్లను పదే పదే టార్గెట్ చేసే శివాజీ బయట కూడా టార్గెట్ చేసినట్లుగా కనిపించడం కాదు.. నిజంగానే శోభా శెట్టికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్ లో.. ఇలాంటి అమ్మాయిలని ఎవరు చేసుకుంటారో, వాడు పారిపోతాడు, అసలు ఇలాంటి అమ్మాయిలు నా ఇంట్లో ఉంటే కాలేసి తొక్కుతా అంటూ మాట్లాడిన శివాజీ పై శోభా శెట్టి కూడా ఫైర్ అయ్యింది. నేను వెళ్లిపోయేలోపు 13 వ వారంలో శివాజీ నిజ స్వరూపాన్ని అందరికి చూపిస్తా అని చెప్పిన శోభా శెట్టి ఆ 13 వ వారంలో సైలెంట్ గా ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసింది.

బయట సీజన్ 7 ఫినిష్ అయ్యేవరకు ఎవ్వరి మీద ఎలాంటి నెగెటివ్ కామెంట్స్ చెయ్యని శోభా శెట్టి.. రీసెంట్ ఇంటర్వ్యూ లో శివాజీ గురించి ఏదో నిజం చెబుతా అన్నారు.. అదేమిటి అని అడిగితె.. దానికి శోభా మాట్లాడుతూ ఆయన పర భాషా అమ్మాయిలని ఎందుకు ఎంకరేజ్ చెయ్యాలని అన్నారు అని చెప్పింది. శివాజీ మరో ఇంటర్వ్యూలో ఆ మాట అన్న శోభా శెట్టి పై ఫైర్ అయ్యారు. నేను ఆ ఆమాట అనలేదు. ఆ అమ్మాయి ఏదో అంది అని నేను నా సహనం కోల్పోను, వాళ్ళు మాట్లాడే మాటలని నేను వ్యతిరేఖించాను. అంతేకాని ఆమెని పరభాషా అమ్మాయి అని అవమానించలేదు. చక్కగా తెలుగులో మట్లాడుతూ సీరియల్స్ చేసుకునే అమ్మాయి నాపై ఆరోపణలు చేస్తే ఊరుకోను.. నేనూ చేతులు కట్టుకుని కూర్చోలేదు, శివాజీని టార్గెట్ చేస్తే ఫేమస్ అవ్వొచ్చని వాళ్ళు అనుకున్నారు అంటూ శివాజీ శోభా శెట్టి పై ఫైర్ అయ్యాడు

 

Shivaji fire on Shobha Shetty:

Shivaji vs Shobha Shetty
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs