Advertisement
Google Ads BL

పల్లవి ప్రశాంత్ హీరో.. భోలే మ్యూజిక్ డైరెక్టర్


బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ కి ఎంత ఫేమ్ వచ్చిందో అలా ఏ సీజన్ విన్నర్ కి రాలేదు. కామన్ మ్యాన్, రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు. అదే ఓ రికార్డ్. మరి కామన్ మ్యాన్ అభినులు ఏదో చేద్దామని ఏదో చేసారు.. ఫలితంగా బిగ్ బాస్ విన్నర్ జైలుకెళ్ళి బైలు పై బయటికి వచ్చాడు. అయితే బిగ్ బాస్ విన్నర్స్ గా నిలిచిన వారికి సినిమా అవకాశాలొస్తాయి, సినిమాల్లో నటులుగా బిజీ అవుతారని తెగ తాపత్రయ పడతారు. కానీ ఇప్పటివరకు  విన్నర్స్ అయినవారు సాధించింది ఏమి కనిపించడం లేదు.

Advertisement
CJ Advs

ఇప్పుడు రైతు బిడ్డ పల్లవిని హీరోని చేసేందుకు చాలామంది చూస్తున్నారట. అదే విషయం పల్లవి ప్రశాంత్ కి బైలుపై జైలు నుంచి వచ్చేందుకు పాటు పడిన మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ భోలే చెబుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో భాగంగా పల్లవి ప్రశాంత్ ఇప్పటికే సినిమా అవకాశాలతో బిజీ అవ్వాల్సి ఉంది. కానీ అతను జైలుకి వెళ్లి రావడం వలన అది ఆలస్యమైంది. లేదంటే ఈపాటికే చాలా సినిమాలకి సంతకం చేసేవాడు, పల్లవి ప్రశాంత్ హీరోగా చేస్తాడా అని చాలామంది అడిగారు.

పల్లవి ప్రశాంత్ హీరోగా చేస్తాడా.. దానికి మీరే మ్యూజిక్  డైరెక్టర్ గా చెయ్యాలని అడుగుతున్నారు. అతను అరెస్ట్ అయినప్పుడు మేము అండగా లేకపోతే అతను డిప్రెషన్ లోకి వెళ్ళేవాడు. అసలు జైల్లో ఉన్నప్పుడు పల్లవి ప్రశాంత్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. బిగ్ బాస్ కి వెళ్లకుండా ఉంటె బాగుండేది అని బాధపడ్డాడు. బయట జనాభిమానం చూసి సంతోషంగా ఉన్నాడు. నన్ను కూడా హీరోగా చెయ్యమని అడుగుతూన్నారు.. కానీ నాకు మ్యూజిక్ డైరెక్ట గా రాణించాలనేది కల అంటూ చెప్పుకొచ్చాడు.

Pallavi Prashanth is the hero, Bhole is the music director:

Hero offers to Pallavi Prashanth?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs