2019 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తూ ప్రభంజనం పుట్టించిన వైస్సార్సీపీ పార్టీ ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల వారికి చేయూతనిస్తూ సక్సెస్ ఫుల్ గా ఐదేళ్ల పాలనని పూర్తి చేసుకోబోతుంది. జగన్ సీఎం గా పేద ప్రజల పక్షాన ప్రభుత్వం పని చేస్తూ.. వారికి అడుగడుగునా అండదండలు అందిస్తుంది. మహిళల పట్ల జగన్ ఆలోచన విధానం, వాలంటీర్ విధానం అన్ని జగన్ ని మరోసారి సీఎం ని చెయ్యాలని ప్రజలు డిసైడ్ అయ్యేలా చేసాయి.
మరోసారి ఏపీలో వైస్సార్సీపీ ప్రభుత్వమే రాబోతుంది అంటూ పలు సర్వేలు చెబుతున్నాయి. 2024 ఎన్నికల్లో వైస్సార్సీపీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేయబోతుంది అంటూ.. Janmat పోల్స్ చెబుతున్నాయి. 2024 ఎన్నికల్లో
116-118 వైసీపీ గెలవనుంది
46-48 టీడీపీ+జనసేన గెలవనుంది అని జన్మత్ పోల్స్ సర్వే తెచ్చేసింది.
ఈ ఏడాది తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో ఈ సర్వే సంస్థ చెప్పినట్టుగానే తెలంగాణ ఫలితాలు కూడా వచ్చాయి.. దీనిబట్టి చూస్తే రానున్న 2024లో జగనే సీఎం అని తెలుస్తుంది.