నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ డెవిల్ రేపు శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 2023 కి గుడ్ బాయ్ చెబుతూ విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు కూడా ఇంట్రెస్ట్ గా కనిపిస్తున్నారు. డెవిల్ మూవీ షూటింగ్ సమయంలో దర్శకుడిగా నవీన్ మేడారం తప్పుకోగా.. ఆ ప్లేస్ లో నిర్మాత అభిషేక్ నామా పేరు వెయ్యడంతో.. ఈ చిత్రంపై కాంట్రవర్సీ స్టార్ట్ అయ్యింది. మరోపక్క డెవిల్ లో నటించిన ఓ నటుడు తన పారితోషకం విషయంలో సోషల్ మీడియాకి ఎక్కాడు.
అయితే ఎన్ని కాంట్రవర్సీలు కనిపించినా అవి ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగమయ్యాయి. సంయుక్త మీనన్ తో మరోసారి రొమాన్స్ చేస్తున్న కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని తనవంతుగా ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. బింబిసార బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ రామ్ క్రేజ్ బాగా పెరిగిపోయింది. అందుకే డెవిల్ కి అన్ని ఏరియాలలోను మంచి బిజినెస్ జరిగింది. మరి డెవిల్ ఏరియాల వారీగా బిజినెస్ లెక్కలు ఎలా ఉన్నాయో చూద్దాం..
DEVIL WW Valued Business
ఏరియా బిజినెస్
👉Nizam: 5.50Cr
👉Ceeded: 3Cr
👉Andhra: 8CR
AP-TG Total:- 16.50CR
👉KA+ROI: 1.60Cr
👉OS – 2Cr
Total WW: 20.10CR~
( Break Even – 21CR~)