కింగ్ నాగార్జున కొన్ని సీజన్స్ అంటే మూడో సీజన్ నుంచి బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఫన్నీ డైలాగ్స్ తో కంటెస్టెంట్స్ ని కూల్ చెయ్యడమే కాదు.. హౌస్ మేట్స్ తప్పులు చేస్తే వారిని శనివారం ఎపిసోడ్ లో క్లాస్ తీసుకుని కడిగిపారేసేవారు. అది చాలామందికి నచ్చేది కాదు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ ఎలా ఉన్నా బయట వాళ్ళ అభిమానులు హంగామా చేసేవారు. అయితే రీసెంట్ గా BB బజ్ యాంకర్ గీతూ రాయల్ నాగార్జున అంత బెస్ట్ హోస్ట్ కాదంటూ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గత సీజన్ లో కప్ కొట్టేద్దామనే ధీమాతో ఫిజికల్ టాస్క్ లు ఆడకుండా మైండ్ మైండ్ గేమ్, లూప్స్ హొల్స్ అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఏదేదో చేసిన గీతూ రాయల్ నమ్మకాన్ని బిగ్ బాస్ యాజమాన్యం అలాగే ఆడియన్స్ వమ్ము చేసి మధ్యలోనే ఇంటికి పంపించేశారు. అది తట్టుకోలేక బిగ్ బాస్ స్టేజిపైనే తెగ ఏడ్చేసిన గీతూ రాయల్ తన ఎలిమినేషన్ కరెక్ట్ కాదు అంటూ కొన్నాళ్ళు మీడియాకి ముఖం చూపించకుండా ఇంట్లోనే ఉంది. ఇక ఈ సీజన్ కి గీతూనే బిగ్ బాస్ బజ్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని ఇంటర్వ్యూ చేసింది.
ఈసీజన్ ముగిసాక గీతూ పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తుంది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా నాగర్జున గారు హోస్ట్ గా టైట్ ప్రశ్నలు వేయడం కానీ, బెండుతీసేలా ఎప్పుడూ మాట్లాడలేదు. కూల్ గా వచ్చి కూల్ గా వెళ్ళిపోయేవారు. ఈ ఒక్క సీజన్ లోనే నాగ్ కఠినంగా ఉన్నారు. నాగార్జున అంతబాగా హోస్ట్ చేయలేదనే చెప్పాలి. ఆయనేమి బేస్ హోస్ట్ కాదు. ఈ మాట ఎందుకన్నాను అంటే నాగార్జున గారు ఎపిసోడ్స్ చూసి మాట్లాడుతారు అనుకున్నాను, కానీ ఆయనకి ముందే స్క్రిప్ట్ వచ్చేస్తుంది అన్న విషయం నాకు తెలియదు.
నేను ఉన్న సీజన్ లో చంటి గారు కీర్తి ని వెటకారంగా మట్లాడారు. ఆ గొడవలో వీడియోస్ తిప్పి తిప్పి చూపించి నాదే తప్పని చూపించే ప్రయత్నం చేసారు. ఇప్పటికి నేను నా తప్పు లేదనే చెబుతాను. అప్పుడు నాగార్జున స్టాండ్ తీసుకుని ఏది తప్పు ఏది ఒప్పు అని చెబితే బావుండేది, ఆ తర్వాత సన్నీ-షణ్ముఖ్ విషయంలోనూ సన్నీ తప్పులేకయినా హౌస్ మేట్స్ చేత సన్నీదే తప్పనిపించారు. మరి ఇదంతా చూస్తే నాగార్జున బెస్ట్ అవ్వరు కదా అంటూ చెప్పి అందరికి ముఖ్యంగా నాగ్ కి షాకిచ్చింది.