ఐపీఎల్, ప్రో కబడ్డీ తర్వాత ఈ తరహాలో చాలా ఆటలు రావడం మొదలయ్యాయి. పొట్టి ఫార్మెట్‌పై ఇప్పుడంతా ఇంట్రెస్ట్ పెడుతున్నారు. అందుకే సెలబ్రిటీలు కొందరు క్రికెట్, కబడ్డీ వంటి టీమ్‌లను ఏర్పాటు చేసుకుని లీగ్‌లకు ప్రిపేర్ అవుతున్నారు. షారుక్ ఖాన్, ప్రీతి జింతా వంటి వారు ఐపీఎల్‌లో భాగమైతే.. అభిషేక్ బచ్చన్ ప్రో కబడ్డీలో టీమ్‌కు ఓనర్‌గా ఉన్నారు. ఇప్పుడు ఇంకొందరు సెలబ్రిటీలు ఇలాంటి పొట్టి ఫార్మెట్‌లో కొత్త లీగ్‌కు శ్రీకారం చుడుతున్నారు. ఈ లీగ్ పేరే ISPL (ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్).
ఈ ఐఎస్‌పీఎల్ గురించి ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హైదరాబాద్ జట్టుకు ఓనర్ అనే విషయం తెలిసిందే. ఇప్పుడు చెన్నై జట్టు ఓనర్‌కు సంబంధించి అధికారికంగా ఓ వార్త వచ్చింది. చెన్నై జట్టును వెర్సటైల్ యాక్టర్ సూర్య సొంతం చేసుకున్నారు. విశేషం ఏమిటంటే ఈ ఐఎస్‌పీఎల్‌లో ఉన్న 5 టీమ్‌లకు సెలబ్రిటీలే ఓనర్లుగా ఉండటం.
స్ట్రీట్‌టుస్టేడియం, న్యూటీ10ఎరా అనే హ్యాష్‌ట్యాగ్‌లతో శ్రీకారం చుట్టుకుంటోన్న ఈ ఐఎస్‌పీఎల్ లీగ్‌లో రామ్ చరణ్ హైదరాబాద్ జట్టుకు, సూర్య చెన్నై జట్టుకు, అమితాబ్ బచ్చన్ ముంబై జట్టుకు, అక్షయ్ కుమార్ శ్రీనగర్ జట్టుకు, హృతిక్ రోషన్ బెంగళూరు జట్టుకు ఓనర్లుగా ఉన్నారు. కోల్‌కత్తా జట్టుకు ఓనర్ ఎవరనేది తెలియాల్సి ఉంది. కాగా, ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్‌పీఎల్)లో తొలి ఎడిషన్ మార్చి 2 నుంచి మార్చి 9 వరకు ముంబై నగరంలో జరగనుంది. 10 ఓవర్స్ ఫార్మెట్‌లో మొత్తం 19 మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. అండర్ 19 ఏజ్ గ్రూప్ కేటగిరీ నుంచి కనీసం ఒక ఆటగాడిని పదకొండు మంది ఉన్న టీమ్‌లో చేర్చడం మినహా ఈ ఆటలో పాల్గొనాలనుకునే వారికి ఎటువంటి వయో పరిమితులు లేవని.. అంతా రిజిస్టర్ చేసుకోవచ్చని ఈ ఐఎస్‌పీఎల్ యాజమాన్యం ప్రకటించింది.