Advertisement
Google Ads BL

డెవిల్‌పై నవీన్ మేడారం ఎమోషనల్!


నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన స్పై థ్రిల్లర్ డెవిల్. అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ స్థాయిలో విడుద‌ల‌కు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా దర్శకుడి విషయంలో మొదటి నుండి కాంట్రవర్సీ నడుస్తున్న విషయం తెలిసిందే. నవీన్ మేడారం అనే దర్శకుడు ఈ సినిమాకు మొదట దర్శకుడు. ఆయన దర్శకత్వంలో దాదాపు 80 శాతం షూటింగ్ పూర్తయిన తర్వాత కొన్ని ఇష్యూస్ తలెత్తడంతో.. నవీన్‌ను తప్పించి స్వయంగా నిర్మాత అభిషేక్ నామానే దర్శకుడిగా మారాడు.

Advertisement
CJ Advs

ఇక విడుదల వేళ ఈ సినిమాకు దర్శకుడు నవీన్ మేడారం అడ్డంకులేమైనా సృష్టిస్తాడేమో అనుకుంటున్న సమయంలో.. అలాంటి పని చేయనంటూ నవీన్ ఓ ఎమోషనల్ లెటర్‌ను విడుదల చేశాడు. ఈ లెటర్‌లో సినిమాకు తనేం చేసిందీ చెప్పిన నవీన్.. కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే వాళ్లు చేసుకుని సినిమాని విడుదల చేస్తున్నారని... సినిమాకు 105 రోజుల పాటు పనిచేసిన తనకు దర్శకుడిగా గుర్తింపునివ్వకపోవడం బాధేసిందని చెప్పుకొచ్చాడు.

ఈ సినిమా విషయంలో ఇప్పటి వరకూ నేను మౌనంగా ఉండటంతో అంతా తప్పు నాదే అనుకుంటూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఈ సినిమా విషయంలో నేను ఎలాంటి తప్పు చేయలేదని క్లారిటీ ఇచ్చేందుకే ఈ లేఖ. ఈగో ఇష్యూల కారణంగా మాత్రమే వివాదం నెలకొంది. చాలా కథనాలు నడుస్తున్నాయి. అయినా సరే.. ఈ సినిమాకు సంబంధించి నేను ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు. కానీ దర్శకుడిగా నాకు క్రెడిట్‌ ఇవ్వనందుకు ఎంతో బాధపడుతున్నా. నా నైపుణ్యంపై నాకు నమ్మకం ఉంది. ఇప్పుడో ప్రాజెక్ట్ చేస్తున్నాను. త్వరలోనే ఆ డిటైల్స్ తెలియజేస్తా. ఆ ప్రాజెక్ట్‌తో తిరిగి మరింత బలంగా కమ్‌బ్యాక్‌ ఇస్తాననే నమ్మకంతో ఉన్నాను. డెవిల్ సినిమా నా బిడ్డలాంటిది. కళ్యాణ్ రామ్‌గారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. నాకు అండగా నిలిచిన కల్యాణ్‌రామ్‌‌గారితో పాటు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. డెవిల్ బ్లాక్‌బస్టర్ అవుతుంది.. అని నవీన్ తన లేఖలో వెల్లడించాడు. కాగా, కళ్యాణ్ రామ్ సరసన సంయుక్తా మీనన్, మాళవికా నాయర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.

Naveen Medaram Opens Up On Devil:

Naveen Medaram Turns Emotional
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs