2024 మోస్ట్ అవెటెడ్ మూవీస్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమా ఒకటి. ఈ సినిమాపై రోజు రోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. చిత్ర నిర్మాతలలో ఒకరు, తారక్ సోదరుడైన నందమూరి కళ్యాణ్ రామ్ తన సినిమా డెవిల్ ప్రమోషన్స్‌లో దేవర గురించి చెప్పిన విషయాలతో పాటు, ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్.. ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలను పెంచేశాయి. ఇప్పుడీ సినిమాకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది.
దేవర ఆగమనానికి ఇంకా ఎన్ని రోజులు టైమ్ ఉందనేది మేకర్స్ తెలియజేశారు. దేవర మొదటి పార్ట్‌ని 5 ఏప్రిల్, 2024లో విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ టైమ్‌కి సినిమాని రెడీ చేసేందుకు మేకర్స్ ఎంతగానో కష్టపడుతున్నారు. ముఖ్యంగా తారక్.. ఈ సినిమాతో అభిమానులను ఖుషి చేసేందుకు ఎంతో శ్రమిస్తున్నట్లుగా టాక్ వినబడుతోంది. కారణం, దేవర ప్రారంభానికి ముందు వినబడిన గాసిప్సే. ఆ గాసిప్స్ అన్నింటికీ బ్రేక్ వేసి.. బ్లాక్‌బస్టర్‌తో సమాధానం ఇవ్వాలని తారక్, దర్శకుడు కొరటాల శివ, టీమ్ అంతా కసిగా వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
అందుకే దేవరకు సంబంధించి వస్తున్న ప్రతి అప్‌డేట్ ఎంతో సాలిడ్‌గా ఉంటుండటం గమనార్హం. మొదట ఒక పార్ట్ అనుకున్నారు.. అది రెండు పార్ట్స్ అయింది. బాలీవుడ్ బ్యూటీ జాహ్నవి కపూర్ హీరోయిన్. మూవీ బ్రాక్‌డ్రాప్.. ఇలా ఒక్కటేమిటి.. టైగర్ వేటకి కావాల్సిన కంటెంట్‌కి కొదవలేదనేలా.. టాక్ నడుస్తూనే ఉంది. ఆ వేట ఎలా ఉండబోతుందో తెలియాలంటే.. ఇంకా వంద రోజులు వెయిట్ చేయకతప్పదు. అవును.. దేవర ఆగమనానికి ఇంకా 100 రోజులే టైమ్ ఉంది. ఇదే విషయాన్ని దేవర అఫీషియల్ ఎక్స్ పేజీలో మేకర్స్ ప్రకటించారు.