Advertisement
Google Ads BL

శృతి హాసన్‌కు పెళ్లి కాలేదట..


సినిమా ఇండస్ట్రీలో కొన్ని పేర్లు ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటాయి. అలాంటి పేర్లలో విశ్వనాయకుడు కమల్ హాసన్ గారాలపట్టి శృతి హాసన్ పేరు కూడా ఒకటి. ఈ పేరు మీద ఎన్ని రకాల వార్తలు వైరల్ అవుతుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులో కొన్ని గాసిప్స్ ఉంటే, కొన్ని నిజంగానే నిజమైన వార్తలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆమె బాయ్ ఫ్రెండ్స్ విషయంలో ఆ మధ్య వార్తలు ఓ రేంజ్‌లో చక్కర్లు కొట్టాయి. ఆ మధ్య ఓ బాయ్ ఫ్రెండ్ శాంతను ని ఆమె కమల్ హాసన్‌కు పరిచయం చేస్తున్న పిక్ వైరలైంది. ఆ తర్వాత శృతికి, శాంతనుకి పెళ్లి అయినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత పెళ్లి కాలేదు కానీ.. బ్రేకప్ అయినట్లుగా టాక్ వచ్చింది. బ్రేకప్ అనంతరం శృతి ఇంకొకరితో రిలేషన్‌లో ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. 

Advertisement
CJ Advs

అయితే శాంతనుతో బ్రేకప్ తర్వాత ఆమె డిప్రెషన్‌కి వెళ్లిపోయి.. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది. మళ్లీ ఈ మధ్యనే రీ ఎంట్రీ ఇచ్చింది. రీ ఎంట్రీలో ఆమె చేసిన సినిమాలన్నీ సక్సెస్ సాధించడం విశేషం. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, హాయ్ నాన్న (గెస్ట్ రోల్).. తాజాగా వచ్చిన సలార్.. ఇవన్నీ విజయాన్ని సాధించిన చిత్రాలే. ఒక రకంగా రీ ఎంట్రీలో శృతి అదుర్స్ అనే చెప్పుకోవాలి. ఇక విషయంలోకి వస్తే.. తాజాగా శృతిహాసన్ సోషల్ మీడియా వేదికగా.. నాకు పెళ్లి కాలేదంటూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ ఓర్హాన్ (ఓరీ) తన తాజాగా ఇంటర్వ్యూలో శృతి హాసన్‌తో పెళ్లయినట్లుగా చెబుతున్న వీడియో ఒకటి వైరల్ అవుతున్న నేపథ్యంలో.. వెంటనే శృతి అలెర్టయింది. నాకు పెళ్లి అయినట్లు వస్తున్న వార్తలు నిజం కాదు.. నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఎవరో ఏదో చెబితే.. ప్రతిదానికి నేను స్పందించాల్సిన అవసరం లేదు. కాబట్టి.. అందరికీ చెప్పేది ఒక్కటే.. వారెవరో కూడా నాకు తెలియదు.. దయచేసి ఆ వార్తలన్ని పట్టించుకోకండి అంటూ  సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. శృతి పోస్ట్ చూసిన అభిమానులందరూ.. లైట్ తీసుకోండి మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Shruti Haasan Post on Marriage Goes Viral:

Shruti Haasan Request to People about Gossips on Her
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs