ఈ నెల 7 న థియేటర్స్ లో విడుదలైన నాని హాయ్ నాన్న ప్రేక్షకులని ఎమోషనల్ గా ఆకట్టుకుంది. తండ్రి-కూతురు మధ్యన వచ్చే ఎమోషనల్ సన్నివేశాలతో హాయ్ నాన్నని ప్రేక్షకులను బాగా ఆదరించారు. దానితో మొదటి 10 రోజులు పూర్తయ్యేసరికి బ్రేక్ ఈవెన్ అయ్యి నిర్మాతలకి లాభాలు తెచ్చిపెట్టింది. ప్యాన్ ఇండియాలోని పలు భాష్లలో విడుదలైన హాయ్ నాన్న అన్ని భాషల్లోనూ 20 రోజులు పూర్తి చేసుకోవడమే కాదు హిట్ టాక్ తెచ్చుకుంది.
ఈనెల మొదటివారంలో విడుదలైన హాయ్ నాన్న మూవీ ఎప్పుడెప్పుడు ఓటిటిలోకి వస్తుందా అని ఫ్యామిలీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే హాయ్ నాన్న విడుదలైన 40 రోజుల తర్వాతే స్ట్రీమింగ్ చెయ్యాలని.. హాయ్ నాన్న డిజిటల్ హక్కులు దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ తో మేకర్స్ ఒప్పందం చేసుకున్నారట. అలయితే జనవరి రెండో వారంలో సంక్రాంతి టైమ్ లేదంటే మూడో వారం అంటే 19 నుంచి కానీ హాయ్ నాన్న ని నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చని తెలుస్తోంది.
మరి ఇప్పటికీ హాయ్ నాన్న ఓవర్సీస్ లో కలెక్షన్స్ కొల్లగొడుతూనే ఉంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో శృతి హాసన్ కీలక పాత్రలో గెస్ట్ గా కనిపించింది.