మెగా ఫ్యామిలీ-అల్లు ఫ్యామిలీ ప్రతి ఒక్క సందర్భంలోను నెటిజెన్స్ నోట్లో నానడమే కాదు, మీడియా దృష్టి నుంచి పక్కకు పోదు. ఎందుకంటే అంతమంది హీరోలు ఆ ఫామిలీస్ లోనే ఉన్నారు కాబట్టి. మహా వృక్షం లాంటి మెగాస్టార్ నుంచి వచ్చిన వేరుల్లా మెగా వారసులు ఇండస్ట్రీలో హీరోలుగా ఉన్నారు. మెగా-అల్లు ఫామిలీస్ లో స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేసేది మాత్రం ఇద్దరే ఇద్దరు ఆ వారసుల్లో. రామ్ చరణ్-అల్లు అర్జున్ లు ప్యాన్ ఇండియా స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. వీరి మధ్యన ఆరోగ్యకరమైన పోటీ ఉండడం కూడా సహజమే. అయితే వీరిద్దరూ కలిసి ఎప్పుడైనా మీడియా కంటకనబడకపోయినా.. ఒకరి బర్త్ డే కి మరొకరు విష్ చెయ్యకపోయినా.. అదిగో మెగా-అల్లు ఫామిలీస్ లో లుకలుకలు అంటూ మీడియా వార్తలు వండి వరిస్తుంది.
ఆ తర్వాత చరణ్-అల్లు అర్జున్ లని కలిపి చూస్తే అబ్బే వారి మధ్యలో ఏమి లేదు.. అంత గాసిప్పే అంటూ నీళ్లు నమలడం పరిపాటిగా మారింది. ఈ ఏడాది చరణ్ బర్త్ డే కి అల్లు అర్జున్ వెకేషన్స్ కి వెళ్లడం, అతను సోషల్ మీడియాలో చరణ్ కి విష్ చేయకపోవడంతో మీడియాలో పెద్ద దుమారమే చెలరేగింది. అయితే వరుణ్ పెళ్లిలో, ఇంకా కొన్ని సందర్భాల్లో వాళ్ళు కలిసి కనిపించారు. ఆ తర్వాత మీడియాలో అలాంటివి కనిపించలేదు. తాజాగా మెగా ఫ్యామిలిలో క్రిస్టమస్ సెలెబ్రేషన్స్ లో అందరూ మట్లాడుకునేలా జరిగాయి.
ఆ వేడుకల్లో ఈ తరం హీరోలంతా అంటే రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, అల్లు శిరీష్, నిహారిక, శ్రీజ, సుష్మిత.. ఇలా మెగా ఫ్యామిలీ కిడ్స్ మొత్తం కలిసి కనిపించారు. ఆ ఫొటోస్ లో చరణ్-అల్లు అర్జున్ పక్కపక్కనే ఉండేసరికి.. రామ్ చరణ్-అల్లు అర్జున్ పక్క పక్కనే నించునున్నారంటూ వార్తలు మొదలెట్టేసాడు. మరి ఇలాంటి ఫొటోస్, లేదంటే ఇలాంటి పార్టీలు జరిగితేనే వాళ్ళ మధ్యన అనుబంధం ఉంది అని నమ్ముతారా.. అనేది ఇప్పుడు మెగా అభిమానులు వేస్తున్న ప్రశ్న.