రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా విషయంలో టీడీపీ నేతలు ఉడికిపోతున్నారు. వ్యూహం సినిమాకి సెన్సార్ అవ్వకుండా నవంబర్ లో నారా లోకేష్ అడ్డం పడగా.. అప్పుడు ఆ సినిమా విడుదల ఆగిపోయింది. ఆతర్వాత RGV మళ్ళీ పట్టుబట్టి సెన్సార్ చేయించి డిసెంబర్ 29 విడుదలకి సిద్ధం చేసాడు. రీసెంట్ గా వైసీపీ నేతలు, మంత్రుల సమక్షంలో వ్యూహం ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకని ఘనంగా నిర్వహించాడు. అయితే వ్యూహం మూవీలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పాత్రలను కించపరిచారంటూ టీడీపీ నేతలు నెత్తినోరుకొట్టున్నారు.
ఈ నెల 29 న విడుదల కాబోతున్న వ్యూహం సినిమాని విడుదల కాకుండా ఆపేయ్యాలంటూ టీడీపీ కార్యకర్తలు RGV డెన్ ముందు నానా రచ్చ చేస్తూ వ్యూహం పోస్టర్స్ ను కాల్చివేసి నిరసన తెలుపుతున్నారు. RGV ఫొటోస్ ని, వ్యూహం పోస్టర్స్ ని దహనం చేస్తూ.. ఇలాంటి సినిమాలు తీస్తే ఊరుకోము అంటూ టీడీపీ కార్యకర్తలు నోటికొచ్చినట్లుగా మట్లాడుతూ నానా యాగీ చెయ్యడం మీడియాలో వైరల్ అయ్యింది. చంద్రబాబు, లోకేష్, పవన్ పై అడ్డమైన డైలాగ్స్ వాడితే ఊరుకోమని RGV డెన్ పైకి వెళ్లారు.
RGV డెన్ దగ్గర టీడీపీ కార్యకర్తలు గొడవ విషయం తెలుసుకుని పోలీసులు అక్కడికి చేరుకోగానే.. టీడీపీ కార్యకర్తలంతా అక్కడ్నుంచి చల్లగా జారుకున్నట్లుగా తెలుస్తుంది.అయితే తన డెన్ ముందు రచ్చ చేసిన వారిని ఉద్దేశించి RGV తనదైన స్టయిల్లో ట్వీటేశారు. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ లని ట్యాగ్ చేస్తూ నా ఆఫీస్ ఎదుట మీ కుక్కలు మొరుగుతున్నాయి. పోలీసులు రాగానే అవి పారిపోయాయి అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు.