Advertisement
Google Ads BL

న్యూ ఇయర్ వేడుకలకి మహేష్ దూరమా?


సూర్ స్టార్ మహేష్ బాబు ఏడాదిలో మూడునాలుగు సార్లు విదేశాలకు ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి వెళుతూ ఉంటారు. తన భార్య నమ్రత, పిల్లు గౌతమ్ కృష్ణ, కుమార్తె సితారలతో గడపడానికి ఆయన వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటారు. ఇలా టాలీవుడ్ లో చేసేది మహేష్ ఒక్కడే. ఇప్పుడిప్పుడు మహేష్ ని చూసి ఎన్టీఆర్, బన్నీ ఇలా అందరూ వెకేషన్స్ కి ఫ్యామిలీస్ తో సహా ఫ్లైట్ ఎక్కుతున్నారు. అయితే మహేష్ బాబు ప్రతి ఏడాది క్రిష్ట్మస్ నుంచి న్యూ ఇయర్ వరకు తన ఫ్యామిలీతో కలిసి విదేశలలోనే ఆ సెలవలని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

Advertisement
CJ Advs

అయితే ఈసారి మహెష్ అండ్ ఫ్యామిలీ విదేశీ ట్రిప్ వేసినట్టుగా కనిపించడం లేదు. ఎందుకంటే వారు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనబడలేదు. ఈరోజు క్రిష్ట్మస్. క్రిస్టమస్ కి రెండు రోజుల ముందే మహేష్ ఫ్యామిలీ హైరాబారాబాద్ నుంచి విదేశాలకి చెక్కేస్తుంది. కాని ఈసారి అలా జరగలేదు. అయితే మహేష్ బాబు ఈసారి న్యూ ఇయర్ వేడుకలకి వెకేషన్స్ ప్లాన్ చేసినట్టుగా కనిపించడం లేదు. కారణమేముంటుంది. గుంటూరు కారం షూటింగ్ కంప్లీట్ చెయ్యాలి. అది కంప్లీట్ అయ్యుంటే మహేష్ వెళ్ళిపోయేవారు.

కానీ గుంటూరు కారం టార్గెట్ సమీపించడంతో మహేష్ ఈసారి వెకేషన్స్ ని త్యాగం చేసి మరీ షూటింగ్ ని చుట్టేస్తున్నారట. సంక్రాంతి టార్గెట్ గా గుంటూరు కారం తెరకెక్కడంతో.. విడుదలకు సమయం దగ్గరవడంతోనే మహేష్ ఈసారి న్యూ ఇయర్ వేడుకలని స్కిప్ చేసినట్లుగా తెలుస్తోంది. 

Is Mahesh away from the New Year celebrations?:

Mahesh and his family 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs