రెండు రోజుల క్రితమే చంచల్ గూడా జైలు నుంచి విడుదలైన పల్లవి ప్రశాంత్ ఆ తర్వాత కామ్ గా తన ఇంటికి వెళ్ళిపోయి.. ఈరోజు సోమవారం తన గురువు అయిన శివాజీ ఇంట్లో తేలాడు. బిగ్ బాస్ హౌస్ లో శివాజీ డైరెక్షన్ లో టాస్క్ లు ఆడి సీజన్ 7 విన్నర్ గా మారిన పల్లవి ప్రశాంత్ కి బయట కూడా విపరీతమైన అభిమానులు ఏర్పడ్డారు. ఎప్పుడూ చూడని ఫేమ్ ఒక్కసారిగా వచ్చేసరికి ఉబ్బి తబ్బిబ్బైన పల్లవి ప్రశాంత్ ఆ అభినులతో కలిసి చేసిన రచ్చతో పోలీస్ కేసు అయ్యింది. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ జైలుకెళ్లాడు.
అతనికి శుక్రవారం కండిషన్ బెయిల్ దొరకడంతో శనివారం జైలు నుంచి విడుదలై సైలెంట్ గా కారెక్కి ఇంటికెళ్ళిపోయిన పల్లవి ప్రశాంత్ ఇంటికి సుబ్బు, యావర్ లాంటి వాళ్ళు వెళ్లారు. ఇక ఈరోజు హైదరాబాద్ వచ్చిన పల్లవి ప్రశాంత్ శివాజీ ఇంటికెళ్ళాడు. లైవ్ లో అభిమానులతో మాట్టాడుతున్న శివాజీ దగ్గరకి పల్లవి ప్రశాంత్ వెళ్ళగానే శివాజీ సంతోషంగా అతన్ని అందరికి చూపించాడు. అయితే పల్లవి ప్రశాంత్ తన అభిమానుల కోసం చేసిన పని, అది కూడా బిగ్ బాస్ హౌస్ ముందు చెయ్యడంతో పోలీసు కేసు అయ్యింది. నిజాయితీగా బయటికొచ్చాడు.
నేను పల్లవి ప్రశాంత్ ని కలవలేదనుకుంటున్నారు. ఇప్పుడు చూడండి. ఇక ప్రశాంత్ కి అభిమానులతో ఎలా ఉండాలో కూడా నేను గైడ్ చేస్తాను, అతను చట్టానికి గౌరవం ఇచ్చాడు. అంతే నిజయితీతో బయటికొచ్చాడు. అంతేకాని అతనేమీ మర్డర్ చెయ్యలేదు.. అతను మంచోడు, రైతు బిడ్డ విన్నర్ అయ్యాడు అంటూ శివాజీ ఆ లైవ్ వీడియోలో చెప్పుకొచ్చాడు.