Advertisement
Google Ads BL

క్రిస్మస్‌ వేడుకల్లో పవన్ కళ్యాణ్ భార్య


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా ఫస్ట్ టైమ్ హైదరాబాద్‌లో క్రిస్మస్‌ను జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ అనాథశ్రమంలో ఆమె ఈ ఫెస్టివల్‌ను జరుపుకున్నారు. వాస్తవానికి అన్నా సామాన్యంగా బయట కనిపించరు. ఈ మధ్య ఆమెపై ఎటువంటి వార్తలు వైరల్ అయ్యాయో తెలిసిందే. అలాంటి వార్తలన్నింటికీ పవన్ ఒకే ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా ఎంత బిజీగా ఉన్నా.. ఎన్ని సినిమాలు చేస్తున్నా.. ఫ్యామిలీని మాత్రం అందులో ఇన్‌వాల్వ్ కానివ్వరు. ఈ విషయం ఆయన పబ్లిగ్గా చెప్పిన విషయం తెలిసిందే. అన్నా కూడా అవసరమైతే తప్ప.. పెద్దగా ఎప్పుడూ కనిపించదు.

Advertisement
CJ Advs

రీసెంట్‌గా వరుణ్ తేజ్ మ్యారేజ్‌లో కనిపించిన అన్నా లెజినోవా.. మళ్లీ పవన్ ఇంటికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లినప్పుడు మాత్రమే ప్రత్యక్షమయ్యారు. ఇప్పుడిలా క్రిస్మస్ వేడుకలలో కనిపించి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. హైదరాబాద్‌, బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్‌ ఫర్‌ ది చిల్డ్రన్‌ సంస్థలో ఆదివారం అన్నా లెజినోవా క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. అక్కడి అనాథ పిల్లలతో కాసేపు సరదాగా గడిపిన అన్నా.. వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వారి సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. ఇంకా ఆ అనాథశ్రమం కోసం ఆమె నిత్యవసరాలను అందించి మానవత్వాన్ని చాటారు. అన్నా గొప్పమనసుకు ఆ అనాథశ్రమ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆమెని సత్కరించారు. ప్రస్తుతం ఈ సెలబ్రేషన్‌కి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. మెగా ఫ్యాన్స్ అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Pawan Kalyan Wife Anna Lezhneva In Christmas Celebrations:

Anna Lezhneva Celebrates Christmas At Orphanage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs