Advertisement
Google Ads BL

విడుదలయ్యాడు కదా అని మళ్ళీ రెచ్చిపోతే..


బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఆ విజయాన్ని సంతోషంగా ఎంజాయ్ చెయ్యకుండానే ఆయన అభిమానుల వలన జైలు పాలయ్యాడు. అభిమానులు హైదెరాబాద్ నడిబొడ్డున ఉన్న అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర చేసిన రచ్చ వలన పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యి చెంచల్ గూడా జైలులో ఊచలు లెక్కబెట్టాడు. అతను అమాయకుడే, కానీ అభిమానులే అరాచకం అన్నట్టుగా ఉంది. అభిమానుల అత్యుత్సాహంతో జైలు పాలయిన పల్లవి ప్రశాంత్ కి నిన్న సాయంత్రం నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. దానితో పాటుగా కండిషన్స్ అప్లై అంది.

Advertisement
CJ Advs

గజ్వేల్ లో పల్లవి ఇంటి దగ్గరే పోలీసులు అరెస్ట్ చేసినప్రశాంత్ ని జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ అనంతరం జెడ్జ్ ముందు నిలబెట్టగా ప్రశాంత్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో  ప్రశాంత్ తరుపు న్యాయవాదుల కృషి ఫలితంగా ఆయనకి కండిషన్ బెయిల్ దొరికింది. అయితే నిన్న బెయిల్ రాగా.. ఈరోజు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని.. పల్లవి ప్రశాంత్ ఆయన సోదరుడు.. ఇంకా ఈకేసులో జైలు పాలయిన మరో ఇద్దరు చంచల్ గూడా జైలు నుంచి విడుదలయ్యారు.

అయితే మరోసారి పల్లవి ప్రశాంత్ జైలు నుంచి వచ్చాడని అభిమానులు రెచ్చిపోయి మళ్ళీ రచ్చ లాంటివి చేస్తే ఈసారి పల్లవి ప్రశాంత్ కి బెయిల్ రాకుండా కేసులు పెట్టేస్తారు పోలీసులు, అందుకే కాస్త కామ్ గా ఉండండి అంటూ నెటిజెన్స్ పల్లవి ప్రశాంత్ అభిమానులని హెచ్చరిస్తున్నారు.

Pallavi Prashanth Released From Jail:

Pallavi Prashanth and his brother released from jail
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs