Advertisement
Google Ads BL

ఫిక్స్: టీడీపీకి పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్


గత ఎన్నికల్లో రాజకీయ వ్యూహ కర్తగా వైసిపికి పని చేసి జగన్ మోహన్ రెడ్డిని ఏపీకి సీఎం ని చేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తన సేవలని టీడీపీ కి అందించడానికి రెడీ అయ్యాడు. గత కొద్దిరోజులుగా ప్రశాంత్ కిషోర్ టీడీపీకి వ్యూహకర్తగా వస్తున్నారనే ప్రచారం జరగ్గానే అబ్బే అదేమీ లేదు.. ప్రశాంత్ కిషోర్ వేరే పార్టీ పనుల్లో బిజీగా వున్నారు. ఆయన ఈ రాజకీయ వ్యూహాలకి దూరంగా ఉన్నారని ఇదంతా టీడీపీ ఆడుతున్న నాటకం, చేస్తున్న ప్రచారం అని వైసీపీ నేతలు హడావిడి చేశారు,

Advertisement
CJ Advs

కానీ 2024 ఎన్నికల్లో టీడీపీకి జనసేనకు సపోర్ట్ చేస్తూ రాజకీయ వ్యూహాలు పన్నెందుకు ప్రశాంత్ కిషోర్ దిగాడు. ఇది నిజం, నేడు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో నారా లోకేష్ తో ప్రశాంత్ కిషోర్ కనిపించడమే కాదు.. లోకేష్ తో కలిసి ఒకే కారులో బయలుదేరి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. వారిద్దరూ ఎయిర్ పోర్ట్ నుంచి బయటికొచ్చి కారెక్కి వెళ్లడం చూసిన వైసీపీ నేతలు అప్పుడే ట్విట్టర్ లో వార్ షురూ చేసారు. మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏమి చేయగలడు ? @naralokesh అంటూ ట్వీట్లు వెయ్యడం స్టార్ట్ చేసారు. 

అంటే గతంలో వైసీపీకి వ్యూహకర్తగా వ్యవహరించి అధికారాన్ని కట్టబెట్టిన ప్రశాంత్ కిషోర్ ని ఏమి అనలేక ఇలా టీడీపీని తగులుంటున్నారన్నమాట. ఏది ఏమైనా పీకే ఇప్పుడు ఏపీ రాజకీయాలని ఏ మలుపు తిప్పబోతున్నారో చూద్దాం. 

Prashant Kishor Spotted In TDP Camp:

Prashant Kishore Meets Nara Lokesh
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs