బిగ్ బాస్ హౌస్ లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కి అడుగడుగునా సపోర్ట్ చేసిన శివాజీ.. తాను విన్ అవ్వాల్సింది కూడా.. కానీ తన మైండ్ గేమ్ తో, అలాగే అమ్మాయిల మీద మాట్లాడిన మాటలతో టైటిల్ విన్నింగ్ కాకపోయినా.. తన శిష్యుడు పల్లవి ప్రశాంత్ ని విన్నర్ అయ్యేలా చేసిన శివాజీ ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై మాట్లాడాడు. ఈ ఇష్యులో పల్లవి ప్రశాంత్ తప్పులేదు, అతను ఇప్పుడు బాధితుడు, ఎవరో చేసిన తప్పుకి పల్లవి ప్రశాంత్ ఫలితం అనుభవిస్తున్నాడు.
పల్లవి ప్రశాంత్ తప్పేమి లేదు.. వాడు అమాయకుడు. అసలు బిగ్ బాస్ ఫినాలే రోజు దాడి చేసిన వాళ్ళు వేరు. అమర్ దీప్ ఫ్యామిలీపై దాడి చెయ్యడం తప్పు. అక్కడ ఎవరున్నా కూడా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఉంటారు. అంటూ శివాజీ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ పై ఓ వీడియో స్పెషల్ గా విడుదల చేసాడు. పల్లవి ప్రశాంత్ ఎక్కడికి పారిపోలేదు, అతను చట్టాన్ని గౌరవిస్తున్నాడు. అతనికి అండగా నేనుంటాను, మేము వాళ్ళకి కలిసిన ప్రతిసారి అందరికి తెలియల్సిన అవసరం లేదు.
పల్లవి ప్రశాంత్ ఫ్యామిలికి అండగా ఉంటాము. పల్లవి ప్రశాంత్ త్వరలోనే వస్తాడు. అతనేమీ నేరం చెయ్యలేదు.. అతనికి బయట ఎలా ఉండాలో తెలియదు. ఇదంతా కావాలనే ఎవరో చేసారంటూ శివాజీ ప్రశాంత్ పై మరోసారి తన అభిమానాన్ని చూపించాడు.