సోషల్ మీడియా ఏంటి.. మీడియాలో ఎక్కడా చూసినా సలార్ మాటే, సలార్ టాకే. ప్రభాస్ కటౌట్ గురించిన కబుర్లే వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. సలార్ సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో మొత్తం సలార్ బ్లాక్ బస్టర్ అంటూ రచ్చ మొదలైపోయింది. ప్రభాస్ ఫాన్స్ మాత్రమే కాదు.. సెలబ్రిటీస్ సైతం సలార్ కోసం క్యూ కట్టారు. అర్ధరాత్రి 1 గంట నుంచే థియేటర్స్ ముందు పడిగాపులు కాచారు. బాహుబలి తర్వాత ఆ రేంజ్ హైప్ తో విడుదలైన సలార్ అందరి అంచనాలు అందుకున్నట్టే కనిపిస్తుంది.
ఫస్ట్ హాఫ్ కోసం సెకండ్ హాఫ్ ని భరించాలనే మాట వినిపించినా.. సెకండ్ హాఫ్ లో యాక్షన్ సీక్వెన్స్ కోసం చూసేయ్యొచ్చు అంటున్నారు. ప్రభాస్ కేరెక్టర్, ఆయన యాక్షన్ సీక్వెన్స్ అయితే ప్రభాస్ ఫాన్స్ కి ఫుల్ మీల్స్ కాదు.. ఏకంగా బిర్యానీనే అంటున్నారు. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ గురించిన ముచ్చట్లు సోషల్ మీడియాని ఒప్పేస్తున్నాయి. ఫస్ట్ హాఫ్ 20 నిమిషాల గురించే అందరూ మాట్లాడుతున్నారు. కొట్టేసాం బ్లాక్ బస్టర్ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
రెబల్ స్టార్ రాంపేజ్, Okateyyyy Debba 🤙🏾🤙🏾🤙🏾, Salaarodi debba.. Box office abbaaaa🔥🔥, కేజీఎఫ్ ను మించి సలార్ ఉంది.. 1000 కోట్లు పక్కా.. ఇప్పుడు సోషల్ మీడియా ముఖ్యంగా ట్విట్టర్ X ఓపెన్ చేస్తే కనిపించే కామెంట్స్ ఇవే. ప్రభాస్ ఫాన్స్ ఆకలి తీరిపోయింది. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ప్లాప్ లని మరిపించేసింది సలార్. ఇది కదా మావ మనకి కావాల్సింది అంటూ ప్రభాస్ ఫాన్స్ థియేటర్స్ దగ్గర రచ్చ చేస్తున్నారు.