పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లో సింపతీ క్రియేట్ చేసుకుని బయట ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నాడు. పల్లవి ప్రశాంత్ ని ఎంతగా అభిమానించారు అంటే.. పల్లవి ప్రశాంత్ పై నామినేషన్స్ లో గొడవపడిన అమర్ దీప్ ని కొట్టేందుకు సిద్ధమయ్యేంతగా. పల్లవి ప్రశాంత్ విన్నర్ గా బయటికొచ్చాడు అని సంతోషించక పల్లవి ప్రశాంత్ అభిమానులు రెచ్చిపోయి అమర్ దీప్ కారుపైకి, ఆయన ఫ్యామిలీపై రాళ్ళ దాడి చేసారు. అంతేకాకుండా ఇంకొంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై, అలాగే RTC బస్సులపై రాళ్లు రువ్వారు. ఫలితంగా పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యి జైలుకెళ్లాడు.
పల్లవి ప్రశాంత్ అభిమానుల వల్లే అతను ఈరోజు విన్నర్ అయ్యుండి జైలు ఊచలు లెక్కబెడుతున్నాడు. విన్నర్ గా బయట సంతోషంగా పార్టీలు చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్స్ లో కూర్చుని కాలర్ ఎగరేస్తూ ఇంటర్వూస్ ఇవ్వాల్సిన పల్లవి ప్రశాంత్ చంచల్ గూడా జైల్లో ఊచలు లెక్కించాల్సి వచ్చింది. కారణం మరెవరో కాదు ఆయన ఫాన్స్.
నిన్న గజ్వేల్ లో అరెస్ట్ అయిన పల్లవి ప్రశాంత్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణ అనంతరం జెడ్జ్ గారు ప్రశాంత్ కి 14 రోజుల్ రిమాండ్ విధించారు, మరి తనని హౌస్ లో టార్గెట్ చేసిన అమర్ పై కి కొట్టడానికి వెళ్ళిన పల్లవి ప్రశాంత్ అభిమానులు ఇప్పుడు చెయ్యరే రచ్చ, తమ అభిమాన రైతు బిడ్డని విడుదల చెయ్యమని చంచల్ గూడా జైలు ముందు ధర్నాలు చెయ్యరే అంటూ నెటిజెన్స్ కూడా కామెడీగా మాట్లాడుతున్నారు. కొంతమందైతే విన్నర్ అయినప్పుడు గుంపులుగా వచ్చినోళ్ళు అయ్యాక రారే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.